E-Paper
Advertisement

కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్…26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లెజెండ్ ఎంట్రీ !

కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్…26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లెజెండ్ ఎంట్రీ !
Advertisement

Om Chapter :ధనుష్.. ప్రయోగాలకి పెట్టింది పేరు. ముఖ్యంగా తెరపై ఎమోషన్ పండించాలన్నా, కామెడీ పూయించాలన్నా ధనుష్ కి మాత్రమే సాధ్యం,అలాంటి ఈ వెర్సటైల్ స్టార్ ఇపుడు మరోసారి తన 55వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌తో మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యాడు. అవును..ఓం చాప్ట‌ర్ 1: ఉధిర‌మ్ ది బ్ల‌డ్ వుడ్” (Om Chapter 1: Udhiram The Blood Wood) అంటూ సరికొత్త టైటిల్ తో ఇపుడు సౌత్ ఇండస్ట్రీలో హీట్ పెంచేశాడు.

400కోట్లని కొల్లగొట్టిన రాజ్‌కుమార్ పెరియసామి

Advertisement

అమరన్ తో ఏకంగా 400కోట్లని కొల్లగొట్టిన రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం ఇక్కడ విశేషం.అయితే ఇదే సినిమా కున్న మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో మళయాళ మెగాస్టార్ కీ రోల్ పోషించనున్నాడు.ఇక మమ్ముట్టి రీసెంట్ గా చేసిన ‘భ్రమయుగం’, ‘టర్బో’ సినిమాలు మనల్ని ఎంతలా ఆకట్టుకున్నాయో చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు స్క్రీన్ కి కళ్ళప్పగించి చూడటం ఖాయం.

26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత

Advertisement

అంతేనా ..ఇంకా ఉందండోయ్.ఏంటో తెలుసా …వీరే సరిపోరు అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ లెజెండరీ నటుడు నసీరుద్దీన్ షా కూడా అడుగు పెట్టబోతున్నాడట. అది కూడా దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళ సినిమాలో కనిపించనున్నాడట.చివరగా నసీరుద్దీన్ షా కనిపించిన సినిమా కమల్ హాసన్ క్లాసిక్ ‘భారతీయుడు’ (ఇండియన్).ఇక చాలా ఏళ్ళకి మళ్ళీ నసీరుద్దీన్ షా తమిళ సినిమాలో కనిపిస్తుండటం తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి,అయితే ఈ సినిమాలో నసీర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతుంది, నిజమెంతో మేకర్సే సెలవివ్వాలి.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

అంతే కాదండోయ్.. వీరికి జోడీగా సౌత్ బ్యూటీస్ సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండటంతో సినిమాపై బజ్ తారాస్థాయికి చేరిపోయింది.ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వస్తున్న ది బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం అండ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఫిలిం ఇదే కాబోలు.

ఇక “ఓం చాప్ట‌ర్ 1” అని టైటిల్ పెట్టడం బట్టి చూస్తె ఇండియన్ సినిమాలో ‘కేజీఎఫ్’, ‘పుష్ప’, ‘కాంతార’ వంటి చిత్రాలు ఫ్రాంచైజీలుగా సక్సెస్ అవుతున్నందువల్లే ఇలా భారీ సినిమాటిక్ యూనివర్స్‌కు శ్రీకారం చుడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ‘బ్లడ్ వుడ్’ అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే కంప్లీట్ ఇంటెన్స్ ఫిలిం నే ధనుష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
చూడాలి మరి భారీ అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

Related News

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!

మెగా 158 కోసం చిరు హైరిస్క్.. నడవలేని స్థితిలో!

ప్రభాస్ 200 కోట్ల కోకాపేట ప్యాలెస్.. ఇల్లు కట్టేది పెళ్లి కోసమేనా?

ఖాకీల మధ్య ‘జాతిరత్నం’ రచ్చ.. నవీన్ పోలిశెట్టికి డీజీపీ అదిరిపోయే కౌంటర్!

మరోసారి అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ కపుల్..

అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాయణం.. కానీ పెళ్లయ్యాక నరకం !

Big Stories

Advertisement
×