E-Paper
Advertisement

ప్రభాస్ 200 కోట్ల కోకాపేట ప్యాలెస్.. ఇల్లు కట్టేది పెళ్లి కోసమేనా?

ప్రభాస్ 200 కోట్ల కోకాపేట ప్యాలెస్.. ఇల్లు కట్టేది పెళ్లి కోసమేనా?
Advertisement

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ..ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఇదే కాబోలు. సరిగ్గా 50కి ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్న డార్లింగ్ తన పెళ్లి ఎప్పుడో తనకే తెలీదంటే నెటిజన్లు మాత్రం మాకు తెలుసుగా అంటూ ఏకంగా ముహుర్తాలు కూడా పెట్టేస్తున్నారు.(ఇప్పటికే ఎన్నో సార్లు పెట్టేశారనుకుకొండి)అంతే కాదండోయ్ ..కాబోయే భార్య కోసం ఏకంగా రీసెంట్‌గా హైదరాబాద్‌లోని అత్యంత రిచ్ ఏరియా అయిన కోకాపేటలో డార్లింగ్ ప్రభాస్ సుమారు రెండు ఎకరాల స్థలంలో, దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఒక ఇంద్రభవనాన్ని నిర్మిస్తున్నాడంటూ ఊదరగొట్టేస్తున్నారు కూడా.

డార్లింగ్ ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కూడా ఇదే

Advertisement

అంతే కాదు. డార్లింగ్ పెళ్లి కూడా ఈ ప్యాలెస్ లోనే జరుగుతుందని, తనకి కాబోయే భార్యకోసం డార్లింగ్ ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కూడా ఇదే అంటూ కమిట్ అయిపోతున్నారు.నిజానికి ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడు అన్న రూమర్స్ ఇప్పుడు వచ్చినవి కాదు. మిర్చి సినిమా టైమ్ లో అనుష్క శెట్టితో ప్రేమాయణం నడుపుతున్నారని, ఇక బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా అనుష్క శెట్టితో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నాడని తెగ హడావిడి చేశారు.కానీ డార్లింగ్ మాత్రం అసలు నిజం ఇదీ అంటూ ఎక్కడా నోరిప్పలేదు.

కృతి సనన్‌తో ఏకంగా ఎంగేజ్ మెంట్

Advertisement

ఇక ఆ తర్వాత ‘ఆదిపురుష్’ టైం లో అయితే సీత పాత్ర పోషించిన బాంబే భామ కృతి సనన్‌తో ఏకంగా ఎంగేజ్ మెంట్ కూడా అయిందని తెగ ఊదరగొట్టేశారు నెటిజన్స్. అంతే కాదండోయ్ ..ఏకంగా అందుకోసం ఏకంగా మాల్దీవుల్లో రిసార్ట్స్ కూడా బుక్ చేసేసింది..ఇక అవన్నీ అయిపోయాయి లేటెస్ట్ గా కొత్తగా అంటూ కోకాపేట ప్యాలెస్ ని వార్తల్లోకి తీసుకొచ్చారు సోషల్ మీడియా వారియర్స్ . నిజానికి ప్రభాస్ పెళ్లిని ఫిక్స్ చేయడం పై ఉన్న శ్రద్ధ వారికి వారిపై కూడా ఉండదేమో కాబోలు.చూడాలి మరి తెగ సర్క్యులేట్ అవుతున్న ఈ కోకాపేట కహనీకి ఎప్పుడు ఎలా బ్రేకులు పడతాయో !

తీరిక ఎక్కడుందో నెటిజన్లే సెలవివ్వాలి

అయితే వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే డార్లింగ్  ఒక లగ్జరీ ఇల్లు కడుతున్న మాట నిజమే అయినప్పటికీ, దానికి పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని ఇన్ సైడ్ టాక్ .అసలు వచ్చే మూడేళ్ల వరకు డార్లింగ్ డైరీ చూస్తే అస్సలు ఖాళీ లేనట్టే కనిపిస్తుంది.ఒకవైపు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా, హను రాఘవపూడి ‘ఫౌజీ’, మరియు నాగ అశ్విన్ తో ‘కల్కి 2’.ఇన్ని సినిమాలని కంటిన్యూ గా లైనప్ చేసుకున్న డార్లింగ్ కి అసలు పెళ్లి చేసుకునే తీరిక ఎక్కడుందో నెటిజన్లే సెలవివ్వాలి .

Related News

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!

మెగా 158 కోసం చిరు హైరిస్క్.. నడవలేని స్థితిలో!

ఖాకీల మధ్య ‘జాతిరత్నం’ రచ్చ.. నవీన్ పోలిశెట్టికి డీజీపీ అదిరిపోయే కౌంటర్!

మరోసారి అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ కపుల్..

అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాయణం.. కానీ పెళ్లయ్యాక నరకం !

రామ్ చరణ్ ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్.. థియేటర్ల కంటే డిజిటల్ వెర్షన్‌లోనే అసలైన ట్విస్ట్!

Big Stories

Advertisement
×