Raashii khanna: ఊహలు గుసగుసలాడే సినిమాలో ప్రభా పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాశీఖన్నా గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సొట్ట బుగ్గల సుందరి తెలుగులో చాలా చిత్రాలు చేసి స్టార్ హోదాను దక్కించుకుంది. అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే పాత్రల ఎంపిక విషయంలో తప్పటడుగు వేయడంతో అవకాశాలు కాస్త చేజారిపోయాయి. దాంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చిన ఈమె మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా ఈమెకు విజయాన్ని అందించలేదు. అయితేనేమ్ అవకాశాలు మాత్రం మెండుగా లభిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమలహాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ధర్మన్. ఈ సినిమాలో అవకాశం అందుకుంది. రజినీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒకవైపు శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంతో పాటు హిందీలో మరో భారీ కామెడీ ఎంటర్టైనర్ లో కీలకపాత్రలో కనిపించబోతోంది రాశీ ఖన్నా. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ , సీనియర్ నటి విద్యాబాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ , అనీస్ బాజ్మీ కాంబినేషన్లో సినిమా అనడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
also read:జబర్దస్త్ ఫైమాకి గాడ్ ఫాదర్ నుండి అదిరిపోయే గిఫ్ట్.. పెళ్ళికానుకలో ఏముందంటే?
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూలు ముగియడంతో ఈ విషయాన్ని తెలుపుతూ రాశీ ఖన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.. “ప్రతి షూటింగ్ షెడ్యూలు మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని కచ్చితంగా నేర్పుతుందని నేను ప్రతిసారి నమ్ముతున్నాను. మన చుట్టూ ఉండే మనుషుల నుంచే మనకు నిజమైన బలం వస్తుంది అని ఈ షెడ్యూల్ నాకు మరోసారి గుర్తు చేసింది. షూటింగ్ మధ్యలో అనారోగ్యం బారిన పడడం అనేది ఎవరికైనా సరే అత్యంత కష్టమైన విషయం. ఇక నా శరీరాన్ని ఒకానొక దశలో నేను చాలా పుష్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అలాంటి సమయంలో నా మేనల్లుడి నుండి వచ్చిన ఒక చిన్న హగ్, ఫ్యామిలీ మెంబర్స్ చేసిన ఫోన్ కాల్స్, అలాగే సెట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి నువ్వు బాగున్నావా? అని అడిగిన పలకరింపులు నా కష్టాన్ని దూరం చేసి నాకు మళ్ళీ ఊపిరి పోసాయి. ఆ ప్రేమతో నా రోజంతా ఎంతో తేలికగా మారిపోయేది” అంటూ సినిమా షూటింగ్ అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
ఇక ఈ సినిమా షెడ్యూల్ ముగిసిన తర్వాత నాకు అలసట ఏమాత్రం గుర్తుకు రాలేదు. కేవలం అందరిపై ఉన్న కృతజ్ఞత భావం మాత్రమే మిగిలింది. కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా అవే జ్ఞాపకాలు నాకు జీవితాంతం నాతో పాటే ఉండిపోతాయి.. అంటూ తన నోట్ లో రాసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.