Coolie Telugu Rights : కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ చేస్తేనే చాలు వాటి మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఉన్నాయి. కేవలం అలాంటి కాంబినేషన్స్ నమ్మి సినిమాలు కొని నష్టపోయిన నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన అజ్ఞాతవాసి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పటికే వాళ్ళిద్దరి కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉండటం. అలానే స్వతహాగా పవన్ కళ్యాణ్ కు 25వ సినిమా కావటం. మొదటిసారి తెలుగులో అనిరుద్ సంగీత దర్శకుడుగా పని చేయడం. ఇవన్నీ కూడా విపరీతమైన అంచనాలు పెంచాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా తీవ్రమైన డిజాస్టర్ ను చవిచూసింది. సరిగ్గా అప్పుడే మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఈ రెండు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కొనుక్కున్న దిల్ రాజు తీవ్రంగా నష్టపోయారు.
దిల్ రాజు స్పీడ్ తగ్గించారు
ఒకప్పుడు దిల్ రాజ్ చాలా స్పీడ్ గా సినిమాలు చేసేవారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఒకేసారి రెండు మూడు సినిమాలు ప్రొడక్షన్ లో ఉండేవి. ఈ బ్యానర్ ఇప్పటికే 50 సినిమాలను నిర్మించింది. దాదాపు 20 మందికి పైగా కొత్త దర్శకులు ఈ బ్యానర్ తోనే పరిచయమయ్యారు. ఇక ప్రస్తుతం ఈ బ్యానర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. నితిన్ మార్కెట్ ను మించి ఈ సినిమాకి దాదాపు 75 కోట్ల వరకు ఖర్చు పెట్టారు దిల్ రాజు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రమోషన్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ కూలి సినిమా రైట్స్ ఎందుకు తీసుకోలేదు క్లారిటీ ఇచ్చారు.
కూలి పై భారీ అంచనాలు
లోకేష్ కనురాజ్ ఈ దర్శకుడికి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. నగరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకున్నాడు. కమలహాసన్ వంటి సీనియర్ హీరోకు విక్రమ్ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ అందించాడు. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా కూలి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చాలామంది పోటీ పడ్డారు. నాగ వంశీ, ఏషియన్ సునీల్, మైత్రి మూవీ మేకర్స్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను కొనడానికి ప్రయత్నాలు చేశారు.
దిల్ రాజు అందుకే కొనలేదు
అయితే దిల్ రాజు కనీసం ప్రయత్నం చేయలేదు. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ “ఇండస్ట్రీ లో ఇప్పుడున్న పరిస్థితులలో పోటీ పడి ఎక్కువ రేట్లకి డబ్బింగ్ సినిమా రైట్స్ కొనలేము” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలోనే కాకుండా యూట్యూబ్ వ్యూస్ విషయంలో కూడా దిల్ రాజు జన్యున్ గా ఉన్నారు. మొత్తానికి దిల్ రాజు మళ్ళీ తన వ్యూహాలు రచిస్తూ నిర్మాణరంగంలో అడుగులు వేస్తున్నారు.
Also Read: Kannappa Tickets Booking: ఈ బుకింగ్స్ చూస్తుంటే మంచు ఫ్యామిలీ బుక్ అయిపోవడం ఖాయం