BigTV English

Wedding Advice: పెళ్లి చూపులకు వెళ్తున్నారా? ఈ ప్రశ్నలు ప్రిపేర్ అవ్వండి.. ప్రాణాలు దక్కుతాయి

Wedding Advice: పెళ్లి చూపులకు వెళ్తున్నారా? ఈ ప్రశ్నలు ప్రిపేర్ అవ్వండి.. ప్రాణాలు దక్కుతాయి

మేఘాలయ… అందమైన ఈ రాష్ట్రం. హనీమూన్ మర్డర్ కేస్‌తో ఉలిక్కిపడింది. పెళ్లయిన పది రోజులకే భర్తను ప్రియుడి సహాయంతో చంపించింది ఒక నవవధువు.


మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఇంకా మర్చిపోకముందే తెలంగాణలో మరో నవవధువు తన భర్తను నెల రోజులకే హత్య చేయించింది.

పై రెండు సంఘటనలు చదివిన వారికి పెళ్లంటేనే భయమేస్తుంది. ముఖ్యంగా పెళ్లికి సిద్ధపడుతున్న అబ్బాయిలు ఈ సంఘటనలతో పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే సందేహంలో పడిపోతున్నారు. అందుకే పెళ్లి చూపుల్లోనే ఆ అమ్మాయి మనసు తెలుసుకుంటే మంచిది. ఆమెకు ఇష్టం లేని పెళ్లి అయితే ఆ పెళ్లిని చేసుకోకపోవడమే మంచిది. లేకుంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుంది.


తెలుగు సాంప్రదాయ ప్రకారం పెద్దలకు కుదిర్చిన వివాహంలో పెళ్లిచూపులు మొదటి భాగం. అలా పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి అబ్బాయి కాసేపు అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. అలా మాట్లాడేటప్పుడు ఆమె మనసు తెలుసుకొనేందుకు కొన్ని ప్రశ్నలను వేయాలి. కొంతమంది అబ్బాయిలు మాట్లాడడానికి మొహమాటపడి ఆ పని చేయరు. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో అమ్మాయిలు మనసు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి పెళ్లిచూపుల్లో ఎలాంటి ప్రశ్నలను అమ్మాయిని అడగాలో తెలుసుకోండి.

పెళ్లిచూపుల్లో అడగాల్సిన ప్రశ్నలు

1. అమ్మాయితో మీరు మొదటి అడగాల్సిన ప్రశ్న ‘మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని’. కచ్చితంగా ప్రతి అమ్మాయి ఇష్టమే అని చెబుతుంది. తల్లిదండ్రులకు భయపడి తలవంచుకొని కూర్చొంటారు అమ్మాయిలు. అయితే ఆమె ప్రవర్తనతోనే మీరు ఆమెకు పెళ్లిచూపులు ఇష్టమో కాదో అర్థం చేసుకోవాలి. ఆమె చూపులు, ఆమె నడవడిక, ప్రవర్తన.. నిర్లక్ష్యంగా అనిపిస్తూ ఉంటే ఆమెతో పెళ్లికి దూరంగా ఉండటమే మంచిది.

2. జీవిత భాగస్వామితో బలమైన నమ్మకమైన అనుబంధాన్ని నిర్మించుకోవాలంటే భార్యగా ఏం చేయాలి? అని అడగండి. ఆమె ఈ ప్రశ్నకు నిబద్ధతతో సమాధానం చెబుతూ ఉంటే ఆమెకు పెళ్లి ఇష్టమేనని అర్థం చేసుకోవాలి. నిర్లక్ష్యంగా సమాధానం చెబితే ఆమెకు పెళ్లి ఇష్టం లేదని తెలుసుకోవాలి.

3. మీ చుట్టూ ఉన్న మీరు చూసిన భార్యాభర్తల అనుబంధాల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు అని కూడా అడగండి.

4. అలాగే ఆమె సామాజిక చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు ఆమె స్నేహితుల గురించి అడిగి చూడండి. అలాగే సోషల్ మీడియాలో ఎంత సమయం ఆమె గడుపుతుందో కూడా తెలుసుకోండి. సోషల్ మీడియా వల్ల కూడా స్నేహితులు ఎక్కువవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ పరిచయాలతో ప్రేమలో పడుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఆమె సోషల్ మీడియా ఖాతాను ఒకసారి పరిశీలించడం కూడా మంచిది. వాటి ద్వారా కూడా ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఎంతవరకు ఆమె సోషల్ లైఫ్ ను గడుపుతోందో కూడా అర్థం చేసుకోవచ్చు.

5. జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో మీరు సొంత నిర్ణయం తీసుకుంటారా? లేక పెద్దవాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తారా? అని కూడా అడగండి. ఆ సమయంలో ఆమె ముఖ కవళికలను గుర్తించండి. ఆమెలో ఏదైనా ఆందోళన కనిపిస్తే కనిపెట్టండి. దీనివల్ల ఆమె జీవితంలో ప్రేమికుడు ఉన్నాడో లేదో అర్థం చేసుకోవచ్చు.

6. బలమైన బంధానికి ప్రతిదీ పంచుకోవాలని చెప్పండి. అంతేకాదు ఆమె చెప్పిన విషయాలు మీరు పెద్దవారితో చెప్పనని హామీ ఇవ్వండి. అలా హామీ ఇస్తేనే ఆమె మీ దగ్గర ఓపెన్ గా మాట్లాడుతుంది.

7. అంతేకాదు ఈ పెళ్లి చూపులకు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా? లేక పెద్ద వాళ్ళ బలవంతమా అని అడగండి. అయితే ఆమె చెప్పే సమాధానాన్ని ఇంట్లోని పెద్దవారికి తెలియనివ్వనని వివరించండి. పెద్దవాళ్ల బలవంతంతోనే ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నానని ఆ అమ్మాయి చెబితే… ఆ విషయాన్ని ఇంట్లోనే పెద్ద వారికి చెప్పకుండా మీరే మేనేజ్ చేస్తానని మాట ఇవ్వండి. నమ్మకం కుదిరితేనే అమ్మాయిలు అన్ని విషయాలు బయటకు చెబుతారు.

8. మీతో పెళ్లిచూపులు పెళ్లి ఇష్టం లేకపోతే… ఓపెన్ గా చెప్పమని అడగండి. ఆమె ఇష్టం లేదని చెప్పినా కూడా ఆ నిందని మీపైనే వేసుకొని… మీకే ఇష్టం లేదని చెబుతానని వివరించండి. అలా ఆ అమ్మాయి నమ్మితేనే తన ప్రేమ జీవితం గురించి ఓపెన్ గా చెబుతుంది. అలా ఎంత చెప్పినా కూడా ఆమె ఏ విషయము చెప్పకపోతే, ఆనందంగానే కనిపిస్తే… మీరు ఆ అమ్మాయి విషయంలో ముందుకు వెళ్ళవచ్చని అర్థం.

Also Read: సల్మాన్ ఖాన్ ఎన్ని వ్యాధులతో బాధపడుతున్నాడో తెలుసా? అవన్నీ ప్రాణాంతకమైనవే

ఫ్రెండులా మాట్లాడండి
ఆమెతో మీరు మాట్లాడేటప్పుడు ఒక స్నేహితుడి లాగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. మీ స్వరాన్ని ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోండి. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతున్నట్టు మాట్లాడితే ఆమె మీకు నిజాలు చెప్పదు. ఆమెతో స్నేహితుడిలా మాట్లాడుతూ ‘ఇష్టం లేని పెళ్లి ఎవరు చేసుకోకూడదు. వివాహంలో నమ్మకానిది, ఇష్టానిదే మొదటి ప్రాధాన్యత. మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి. మీ పైన నింద రాకుండా నేనే మేనేజ్ చేస్తాను’ ఇలా మాట్లాడేందుకు ప్రయత్నించండి.

బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి
పెళ్లిచూపుల్లో ఎంతగా మీరు మాట్లాడినా ఆమె నుంచి ఎలాంటి నెగిటివ్ రెస్పాన్స్ రాకపోతే… మీరు కొంతవరకు ఆ పెళ్ళిలో ముందుకు వెళ్లవచ్చు. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియా చరిత్ర, ఆమె స్నేహితులు ఎలాంటివారు, ఆమె పనిచేసే చోట ఎలా ఉంటుంది?, ఆమె గత జీవితం గురించి ఎంక్వయిరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మీరు ప్రైవేటు డిటెక్టివ్‌లను కూడా ఆశ్రయించవచ్చు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి పెళ్లికి ముందే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×