BigTV English

AB de Villiers: కోహ్లీ, రోహిత్‌పై గ్యారెంటీ లేదు..ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెట‌ర్ !

AB de Villiers: కోహ్లీ, రోహిత్‌పై గ్యారెంటీ లేదు..ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెట‌ర్ !

AB de Villiers: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు రిటర్మెంట్ లైఫ్ కు దగ్గర పడ్డారు. ఇప్పటికే టెస్టులు అలాగే టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు, వన్డేల్లో ఛాన్సులు దక్కించుకునేందుకు చాలా కష్టాలు పడుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ సమయం వరకు ఆడి రిటైర్మెంట్ ఇవ్వాలనుకున్న వీళ్ళ ప్లాన్ ను బెడిసికొట్టేలా చేసింది బీసీసీఐ. అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై AB డివిలియర్స్ ( AB de Villiers ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి ఆట తీరుపై గ్యారెంటీ లేదని, అందుకే బీసీసీఐ గిల్ ను తెరపైకి తీసుకువచ్చారని బాంబు పేల్చారు AB డివిలియర్స్.


Also Read:  India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియాలో ఉండడం కష్టమే!

2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా జట్టులో చోటు దక్కాలంటే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు పరుగులు ఎక్కువ చేయాల్సి ఉంటుందని సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పరుగులు ఎక్కువగా చేయకపోతే వాళ్ళిద్దరూ టీమిండియాలో ఉండటం కష్టమేనని తేల్చి చెప్పారు. వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఉంటారన్న గ్యారెంటీ తనకైతే లేదని కుండబద్దలు కొట్టి చెప్పేశారు డివిలియర్స్. అందుకే కొత్తగా గిల్ ను తెరపైకి తీసుకువచ్చారని వివరణ ఇచ్చారు. రోహిత్ శర్మ శర్మ కెప్టెన్సీ తొలగించి, గిల్ ను కెప్టెన్ చేయడం మంచి పరిణామం… అందులో ఎలాంటి తప్పిదం లేదని మళ్లీ మంట పెట్టే ప్రయత్నం చేశారు ఏ బి డివిలియర్స్.


రోహిత్ శర్మ అలాగే కోహ్లీ ఉన్నప్పుడే గిల్ కు కెప్టెన్సీ ఇస్తే, కచ్చితంగా అతడు చాలా నేర్చుకుంటాడని క్లారిటీ ఇచ్చారు. టీమిండియా జట్టులో పోటీ ఎక్కువ, చాలామంది యంగ్ క్రికెటర్లు వస్తున్నారు. అందుకే సీనియర్ క్రికెటర్లకు ఛాన్సులు రాకపోవచ్చు.. వాళ్లు బయటకు వెళ్తే యంగ్ క్రికెటర్లకు ఛాన్సులు వస్తాయి అని వివరించారు. యంగ్ క్రికెటర్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే కోహ్లీ ఇద్దరు రన్స్ చేయాల్సిందే, చేయకపోతే పీకి పడేస్తారు అని హెచ్చరించారు. దీంతో కోహ్లీ అలాగే రోహిత్ శర్మ పై AB డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read: Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

ఇది ఇలా ఉండగా, టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో సాధారణ ప్లేయర్లు గానే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ బరిలోకి దిగుతారు. గిల్‌ కెప్టెన్సీలో ఈ ఇద్దరు ప్లేయర్లు ఆడనున్నారు. అంతేకాదు ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

Related News

Manoj Tiwary: కోహ్లీ, రోహిత్ ఉంటే ప్ర‌శ్నిస్తారు..అందుకే వాళ్ల గొంతు గంభీర్ నొక్కేశాడు

Gautam Gambhir: గంభీర్ మ‌హాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మ‌రీ !

Inzamam-ul-Haq: రోహిత్ శ‌ర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !

Womens World Cup 2025: నేడు ఇంగ్లాండ్ తో బంగ్లా ఫైట్‌..పాయింట్ల ప‌ట్టిక ఇదే, చిట్ట‌చివ‌ర‌న పాకిస్థాన్‌

IND VS AUS: టీమిండియాతో సిరీస్.. కమిన్స్ లేకుండా ఆసీస్‌..జ‌ట్ల వివ‌రాలు ఇవే

MS Dhoni: రోహిత్‌, కోహ్లీని గెంటేశారు..కానీ ధోనిని ఎవ‌డు కూడా ట‌చ్ చేయ‌లేదు..కార‌ణం ఇదే

World Cup 2027: రోహిత్, కోహ్లీ ప్రపంచ కప్ 2027 ఆడాలంటే..ఈ రూల్స్ పాటించాల్సిందే !

Big Stories

×