E-Paper
Advertisement

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ కొత్త గేమ్ ప్లాన్.. ముందు చేసిన తప్పు చేసేది లేదంటూ..!

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ కొత్త గేమ్ ప్లాన్.. ముందు చేసిన తప్పు చేసేది లేదంటూ..!
Advertisement

Siddhu Jonnalgadda:టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ పేరు గత కొన్నేళ్లలో చాలా వేగంగా ప్రేక్షకుల మధ్యకి వచ్చింది. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో సిద్ధు ఒక్కసారిగా స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ సినిమా కలెక్షన్లు కూడా అద్భుతంగా ఉండటంతో అతని క్రేజ్ మరింత పెరిగింది.

అయితే టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన జాక్, తెలుసు కదా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో సిద్ధు కెరీర్ కొంత మందగించింది. దీంతో ఇప్పుడు మళ్లీ మంచి కథలతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని సిద్ధు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందు చేసిన తప్పు చేయకుండా ఈసారి మంచి కథలు ఎంచుకొని.. వరసగా మూడు సినిమాలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నట్లు వినికిరి.

కొత్త కథలను వినడంలో బిజీ..!

Advertisement

గత కొన్ని నెలలుగా సిద్ధు కొత్త కథలను వినడంలో బిజీగా ఉన్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనేకమంది దర్శకులు చెప్పిన కథలను శ్రద్ధగా విన్న తర్వాత అతనికి నచ్చిన మూడు కథలను మాత్రమే ఎంపిక చేసుకున్నాడట. ఇప్పుడు ఆ మూడు ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కావచ్చని సమాచారం.

ఈ మూడు సినిమాల్లో ఒకటి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ’ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జేతో ఉండబోతుంది. ఈ కలయిక ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తోంది.

Advertisement

ఇంకో సినిమా టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరితో ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇది పెద్ద స్థాయిలో తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు.

మూడో సినిమా మాత్రం పూర్తిగా భిన్నమైన సోషియో ఫాంటసీ కథతో ఉండబోతుందట. ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని సమాచారం. కొత్త కాన్సెప్ట్‌తో సిద్ధు ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని భావిస్తున్నాడట.

ALSO READ: Dhurandhar 2 Cameo: సల్మాన్ కాదు.. ఇమ్రాన్ కాదు..ధురంధర్ 2లో బడే సాహబ్ అసలు ఎవరు?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×