Mega 158 : మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పట్టం పోలే అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక.
ప్రస్తుతం మన ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూడటం అలవాటు అయిపోయింది. గొప్ప నటీనటులు సినిమాలు ఏ భాషలో ఉన్నా కూడా అందరూ చూడటం మొదలుపెట్టారు. అలానే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా కూడా చూశారు. ఆ సినిమా చూసిన తర్వాత లోకేష్ నెక్స్ట్ సినిమా పైన అందరికీ అంచనాలు మొదలయ్యాయి. అప్పుడు లోకేష్ చేసిన సినిమా మాస్టర్. ఆ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది మాళవిక. అక్కడితో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో తన 158 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా ముహూర్తపు పూజ నవంబర్ 5వ తారీఖున జరగనుంది. ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించిన సమాచారం వినిపిస్తుంది. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాబీ చెప్పిన కథ మెగాస్టార్ కు విపరీతంగా నచ్చడంతో మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మాస్టర్ సినిమాలో చారులత అనే పాత్రలో కనిపించింది. అయితే ఆ సినిమా తర్వాత మారన్ అనే తమిళ్ సినిమా కూడా చేసింది. ఇకపోతే మలయాళం లో క్రిస్టి సినిమాలో కనిపించింది మాళవిక. కేవలం మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూశారు.
థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా సోనీ లీవ్ లో తెలుగులో చూసి మాళవికకు ఫ్యాన్ అయిపోయిన అభిమానులు కూడా ఉన్నారు. క్రిష్టి సినిమాలో చాలా అందంగా కనిపిస్తుంది మాళవిక.
అయితే సోషల్ మీడియాలో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ మాళవిక ఎప్పుడు హాట్ ఫొటోస్ ను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. మాళవిక అందాలకు చాలామంది ఫిదా అయిపోయారు. చివరిగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాన్ సినిమాలో కనిపించింది.
Also Read: Ramya Moksha: ఆర్మీ ఆఫీసర్ కి అవమానం.. పచ్చళ్ల పాప నోటి దూ** ఇంకా తగ్గలేదు