Meesala Pilla : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. ఇక ఈ సినిమా కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశాడు అనిల్. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా మంది ఆడియన్స్ మిస్ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు బాస్ కామెడీ టైమింగ్ వర్కౌట్ అవ్వడమే.
అనిల్ విషయానికొస్తే జనాల పల్స్ తెలుసు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే ఇప్పటివరకు అనిల్ చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కాలేదు. ఇక మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఉదిత్ నారాయణ పాడిన మీసాల పిల్ల అనే పాటను కొద్దిసేపటికృతమే విడుదల చేశారు.
ఉదిత్ నారాయణ పాటలు ఎంతగా ఆకట్టుకుంటాయో అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి కి కైకల్లూరి కన్నెపిల్ల, రామ్మా చిలకమ్మా, వాన వాన అంటే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. బహుశా దీనిని దృష్టిలో పెట్టుకొని అనిల్ రావిపూడి సింగర్ గా మీసాల పిల్ల పాటకు ఉదిత్ నారాయణను తీసుకువచ్చారు. ఉదిత్ నారాయణతో పాటు శ్వేతా మీనన్ ఈ పాటను ఆలపించారు.
ఈ పాటలోని ‘నువ్వు ఇంత హార్ష్ గా మాట్లాడాలా, హార్ట్ హర్ట్ అయిపోయేలా” అనే లైన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం లిరిక్స్ మాత్రమే కాకుండా మెగాస్టార్ స్టెప్స్ కూడా ఈ పాటకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మెగాస్టార్ తో పాటు నయనతార కూడా డాన్స్ చేయడం కనులు విందుగా అనిపిస్తుంది. ఈ పాటను భాస్కరభట్ల రచించారు.
మామూలు రోజుల్లో కంటే కూడా సంక్రాంతి సీజన్ లో సినిమాలు విపరీతంగా చూస్తారు అనే విషయం తెలిసిందే. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా పండగకు ప్లాన్ చేయడానికి కూడా కారణం అదే. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎటువంటి అంశాలను కోరుకుంటారో అవన్నీ కూడా ఈ సినిమాలో పొందుపరిచాడు అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు.
పాట ఎలానో హిట్ అయిపోతుంది కాబట్టి, ఇక మిగిలిన అంచనాలన్నీ సినిమా మీద ఉన్నాయి. ఈ సినిమాతో పాటు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాయి. సినిమాలు బాగుంటే అన్నిటిని కూడా ఆదరించడానికి ప్రేక్షకులు వెనకాడరు.