Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) తెలుసు కదా(Telusukada) అనే సినిమా ద్వారా అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, రాసి ఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేరి దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా భారీగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ కూడా మంచి అంచనాలను పెంచేసింది.
ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు ఇందులో భాగంగానే ఒక లేడీ జర్నలిస్ట్ సిద్దు జొన్నల గడ్డను ప్రశ్నిస్తూ మీరు నిజజీవితంలో కూడా ఊమనైజరా అంటూ ప్రశ్న వేయడంతో సిద్దు జొన్నలగడ్డ ఇది సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూనా? లేకపోతే పర్సనల్ ఇంటర్వ్యూనా? అంటూ కొంత పాటీ అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయంపై సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ సదరు లేడీ జర్నలిస్ట్ ఊమనైజర్ అన్న పదం నాకు వినిపించిందని తెలిపారు.కానీ నేను ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాను. అలా మాట్లాడటం తప్పు అనే విషయాన్ని వాళ్లు రియలైజ్ అవ్వాలని, చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం అగౌరవించినట్లేనని ఈయన మండిపడ్డారు. ఆమె ఈ కార్యక్రమం ప్రారంభానికి 10 నిమిషాలు ముందే అక్కడికి వచ్చారు. ఈ ఇంటర్వ్యూ కోసం చాలా రిక్వెస్ట్ చేస్తేనే లోపలికి వచ్చారని లోపలికి వచ్చిన తర్వాత మైక్ తీసుకుని ఇలా మాట్లాడారని సిద్దు జొన్నలగడ్డ తెలిపారు.
చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది..
ఈ మధ్యకాలంలో ఆమె మరి చిన్నపిల్లల ప్రవర్తిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారట సదరు జర్నలిస్టుపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. అయితే ఇటీవల కిరణ్ అబ్బవరం, ప్రదీప్ రంగనాథన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ చూడటానికి హీరో మెటీరియల్ కాదు అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఇదే విషయం గురించి కిరణ్ అబ్బవరాన్ని ప్రశ్నించడంతో ఆయన కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే హీరోల గురించి అలా మాట్లాడుతూ అవమానపరిచొద్దు, మనం మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ ఇతర రాష్ట్రాల హీరోలను కించపరచొద్దు అంటూ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. మీడియా వారు ప్రశ్నించడంలో తప్పులేదు కానీ మరి వ్యక్తిగతంగా వారిని కించపరుస్తూ మాట్లాడటం పూర్తిగా తప్పు అంటూ ఈ వివాదం పై పలువురు అభిమానులు, నెటిజన్లు కూడా హీరోలకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Mithra Mandali: మిత్రమండలి పై లిటిల్ హార్ట్స్ ఫార్ములా .. వర్కౌట్ అయ్యేనా?