Srihan : శ్రీహన్, సిరి ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబ్ వీడియోలు తోనూ, టిక్ టాక్ వీడియోలతోనూ, రీల్స్ తో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ క్రేజ్ ను మరింత పెంచుకున్నారు.. సిరి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉండగా శ్రీహాన్ సైతం సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే శ్రీహన్ వర్జిన్ బాయ్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహాన్ తన వర్జినిటీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శ్రీహన్ సిరి కన్నా ముందు మరొకరితో..
ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న శ్రీహన్ కు వర్జినీటి గురించి ప్రశ్న ఎదురవుతుంది. ఈ సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో చూశాం కదా.. అయితే మీరు మీ వర్జినటిని ఎప్పుడు కోల్పోయారు అని యాంకర్ ప్రశ్నిస్తారు.. దానికి ఫస్ట్ శ్రీహన్ నేను వర్జిన్ ని అని అన్నా కూడా యాంకర్ తెలివిగా అతని నోటితోనే నిజం చెప్పిస్తాడు.. నీ వర్జినటి సౌత్ లో కోల్పోయావా నార్త్ లో కోల్పోయామని యాంకర్ అడుగుతాడు. సౌత్ లోని అని నిర్మోహమాటంగా సమాధానం చెప్తారు శ్రీహన్.. శ్రీహన్ 24 ఏళ్ల క్రితమే ఓ అమ్మాయితో ప్రేమాయణం నడిపిన విషయాన్ని బయట పెట్టాడు. అయితే సిరి కన్నా ముందు ఇంకొకరితో నువ్వు ఉన్నావు అన్న విషయం సిరికి తెలుసా అని అడిగితే.. నేను ఏదీ దాచుకోలేదు ఆ విషయం ఇంకొకసారి చెప్తే చెప్పుతో కొడతారు అని సిరి అంది అని నిజం చెప్తాడు.. సిరి తో రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి నాకు అన్నీ తానే.. మధ్య ఎన్ని రూమర్స్ వినిపించిన కూడా మేమేంటో మాకు తెలుసు కాబట్టి అవి పెద్దగా లెక్క చేయము అంటూ శ్రీహాన్ అన్నాడు.
సిరితో పెళ్లి అప్పుడే..?
వర్జిన్ బాయ్స్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీహన్ సిరి రిలేషన్ గురించి కూడా బయటకు వస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి గురించి యాంకర్ అడుగుతాడు..గత ఆరు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా పెళ్లి కాకుండానే వీరిద్దరూ ఒక బాబుని దత్తత తీసుకొని బాబు బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న తరచూ అభిమానులకు కలుగుతుంది. ఈ క్రమంలోనే శ్రీహన్ పెళ్లి గురించి తాజాగా క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటామని అన్నాడు.. కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి పూర్తి చేసుకొని పెళ్లి చేసుకుంటామని ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో త్వరలోనే సిరి శ్రీహన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చేసాయి..
ఇక వర్జిన్ బాయ్స్ సినిమా విషయానికి వస్తే..మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ వర్జిన్ బాయ్స్ ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..