wives killed husband: ప్రస్తుత కాలంలో చంపడాలు కామన్ అయిపోయింది. భార్యను భర్త హత్య చేయడం, భర్తను భార్య హత్య చేయడం, తల్లిని చంపడం.. ఇలా అనేక కారణాల వల్ల ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలా చంపుకోవడం వల్ల తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిసి కూడా హత్యలు ఆగడం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నిన్న రాత్రి జనగామా జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను కడతేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. లింగాల ఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఇద్దరూ భార్యలు అక్కాచెల్లెళ్ళు కావడం ట్విస్ట్.
వివరాల్లోకి వెళితే..
జనగామా జిల్లా, లింగాలఘనపురం మండలంలోని.. ఏనబావి గ్రామ శివారులో పిట్లోనిగూడెంలో కాల్య కనకయ్య(30) ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నాడు. కనకయ్య మద్యానికి బానిసగా మారాడు. మే నెలలో మద్యం మత్తులో అత్తను కనకయ్య హత్య చేసి పారిపోయాడు. జైలులో ఉన్న కనకయ్య అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలతో పాటు గ్రామస్థులను బెదిరించేవాడు.
Also Read: కూలిన కరకట్ట గోడ.. డేంజర్‌లో భద్రాచలం
అతడి ఆగడాలకు ఎక్కువ కావడంతో భార్యలు విసిగిపోయారు. కాపురానికి వెళ్లకుండా తల్లి ఇంట్లోనే శిరీష, గౌరమ్మ ఉంటున్నారు. జైలులో ఉన్న కనకయ్య ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు. సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు.. తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తాయి. మద్యం మత్తులో గొడ్డలితో భార్యల దగ్గరకు గొడవకు వెళ్లాడు. దీంతో ఇద్దరు భార్యలు ఎదురుతిరిగి గొడ్డలి తీసుకొని అతడిని నరికేశారు. కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి, చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.