E-Paper
Advertisement

NTR War 2 : వార్ 2 పై నాగ వంశీ బిగ్ అప్డేట్.. మూడో బ్లాక్ బస్టర్ అంటూ వీడియో రిలీజ్!

NTR War 2 : వార్ 2 పై నాగ వంశీ బిగ్ అప్డేట్.. మూడో బ్లాక్ బస్టర్ అంటూ వీడియో రిలీజ్!
Advertisement

NTR War 2 : నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని పంచుకున్నారు. ఈ ఒక్క వీడియోతో నందమూరి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే వార్ -2 కి సంబంధించిన అప్డేట్.. మరి ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి..? నాగ వంశీ మరోసారి నందమూరి అభిమానులకి హ్యాట్రిక్ ఇవ్వబోతున్నారా?అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వార్ -2 తో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్న ఇద్దరు స్టార్స్..

Advertisement

అయాన్ ముఖర్జీ( Ayan Mukherjee) డైరెక్షన్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) , జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR ) నటించిన తాజా మూవీ వార్-2.. ఈ సినిమాపై నార్త్, సౌత్ లో భారీ హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో సినిమా వస్తుంది అంటే.. ఆ సినిమా పై అభిమానుల్లో ఎన్ని అంచనాలు ఉంటాయో మాటల్లో చెప్పలేం. అలాంటి ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో వార్-2 రాబోతోంది. ఆగస్టు 14న వార్-2 సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

వార్ -2 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..

Advertisement

ఇక ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ బర్త్డే రోజు టీజర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్(Sitara Entertainment Banner) నిర్మాత అయినటువంటి నాగవంశీ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేశారు. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. అరవింద సమేత(Aravinda Sametha), దేవర ఇప్పుడు వార్-2.. ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఎన్టీఆర్ కాంబోలో ఇప్పటికే అరవింద సమేత, దేవర (Devara) అనే రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చాయి. అయితే ముచ్చటగా మూడోసారి నాగ వంశీ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా(War-2 Movie) ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారట.తాజాగా వార్-2 తెలుగు రైట్స్ ని నాగ వంశీ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

భారీ హైప్ పెంచుతూ.. అంచనాలు పెంచేసిన నిర్మాత..

అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలుపుతూ నాగ వంశీ తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ , నాగవంశీ కాంబోలో ఇప్పటికే అరవింద సమేత,దేవర సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం వార్-2 సినిమాను కూడా తీసుకొస్తున్నాం.మూడో బ్లాక్ బస్టర్ కి సిద్ధమవుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు నందమూరి అభిమానుల (Nandamuri Fans)కు హ్యాట్రిక్ అందించబోతున్నాం అంటూ నాగ వంశీ పెట్టిన పోస్ట్ నందమూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.

హ్యాట్రిక్ గ్యారెంటీ అంటూ..

ఈ వీడియో చూసిన నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అలా ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. ఇక వార్-2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ విజయం అందుకోవాలని నందమూరి అభిమానులు ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.

వార్ -2 సినిమా విశేషాలు..

ఇక వార్-2 సినిమా విషయానికి వస్తే..రీసెంట్ గానే వార్-2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.అదేంటంటే హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ ఇద్దరి మీద ఒక పాట షూట్ చేస్తున్నారట.ఈ పాట కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఓ టాక్ వినిపించింది. అలా సినిమాకి హైప్ పెంచుతూ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ భారీ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాత ఆదిత్య చోప్రా (Adithya Chopra) .

also read:Fish Venkat: ఫిష్ వెంకట్ కి ప్రభాస్ రూ.50 లక్షలు సాయం.. మోసం చేశారంటూ కన్నీరు మున్నీరవుతున్న భార్య, కూతురు!

 

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×