Fish Venkat Wife on Prabhas:: ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, కామెడీ విలన్ గా నటించి.. ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం ఎలాంటి దీన స్థితిలో ఉన్నారో చెప్పనక్కర్లేదు. రెండు కిడ్నీలు పాడయ్యి.. చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఇప్పటికే ఫిష్ వెంకట్ భార్య,కూతురు ఇద్దరు మీడియా ముందుకి వచ్చి తమ బాధను బయటపెట్టారు. ఇండస్ట్రీ నుండి ఎవరైనా వచ్చి మాకు సహాయం చేయాలని వేడుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఫిష్ వెంకట్ కి అండగా ప్రభాస్..
అలాగే ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మాట్లాడుతూ.. మా నాన్న ఆపరేషన్ కి రూ.50 లక్షలు దాకా ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారని, ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు మాకు సాయం చేయాలని చెప్పారు.అయితే ఫిష్ వెంకట్ హాస్పిటల్ లో ఉన్న సమయంలోనే ఫిష్ వెంకట్ కూతురు మీడియాకి సమాచారం ఇస్తూ..మాకు ప్రభాస్ అసిస్టెంట్ నుండి కాల్ వచ్చిందని, మా నాన్న ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం వాళ్లే భరిస్తామని చెప్పారని, కిడ్నీ డోనర్ ఎవరైనా ఉంటే చూసుకోమని చెప్పారంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ప్రభాస్ అభిమానులు అందరూ ప్రభాస్ ని పైకి ఎత్తేస్తూ ప్రభాస్ ఎంత గొప్పవాడో..ఏకంగా 50 లక్షలు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు అంటూ తెగ వైరల్ చేశారు.
ప్రభాస్ పేరుతో మోసం చేశారంటూ తల్లీకూతుళ్ళు కన్నీరు..
కట్ చేస్తే.. తాజాగా ప్రభాస్ పేరుతో మోసం చేశారు అంటూ మీడియా ముందు ఫిష్ వెంకట్ కూతురు, భార్య కన్నీరు పెట్టుకున్నారు. ప్రభాస్ అసిస్టెంట్ అంటూ కాల్ చేశారు.మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అసలు కలవడం లేదు.. వాళ్లే మాకు స్వయంగా ఫోన్ చేసి ప్రభాస్ మీ భర్త ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పారని, 50 లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ తర్వాత చాలా సంతోషపడ్డాం. కానీ మళ్ళీ ఫోన్ చేస్తే కలవడం లేదు.అది ఓ ఫేక్ కాల్ అని తెలుస్తుంది అంటూ చెప్పారు. అలాగే ఇండస్ట్రీ నుండి ఎవరు కూడా మాకు సహాయం చేయలేదని, ఫిష్ వెంకట్ స్నేహితులే కొన్ని డబ్బులు తీసుకువచ్చి మాకు ఇస్తే ఆ డబ్బులతోనే నెట్టుకొస్తున్నాం. గబ్బర్ సింగ్ మూవీ లోని అంత్యాక్షరి టీం అందరూ వచ్చారు. కానీ అందులో ఒక వ్యక్తి లక్ష రూపాయలు ఇచ్చారు. మిగతా వాళ్ళు సైలెంట్ గానే వెళ్లారు. అంటూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు ఫిష్ వెంకట్ భార్య. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది షాక్ అవుతున్నారు.
ఫిష్ వెంకట్ నటించిన సినిమాలు..
ఇక ఫిష్ వెంకట్ నటించిన సినిమాల విషయానికి వస్తే.. గబ్బర్ సింగ్ (Gabbar Singh), బన్నీ(Bunny), శంఖం(Shankham), రెడీ(Ready),నాయక్ (Nayak) ,దిల్(Dil),కింగ్(King),డాన్ శీను(Don Seenu), అదుర్స్ (Adurs),మిరపకాయ్ (Mirapakai), దరువు(Daruvu), సుప్రీం(Supreem),బాబు బంగారం(Babu Bagaram), డీజే టిల్లు(DJ Tillu) వంటి సినిమాల్లో నటించారు. ఇక ఫిష్ వెంకట్ చివరిగా ‘ కాఫీ విత్ ఏ కిల్లర్’ అనే మూవీలో నటించారు.
ALSO READ:Pawan Kalyan – Ram Charan: బాబాయ్ సినిమాలో అబ్బాయ్ కీ రోల్.. సినిమా ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!