Dude Movie: హీరోగా , డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. లవ్ టుడే, డ్రాగన్ వంటి సినిమాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తాజాగా దీపావళి సందర్భంగా డ్యూడ్(Dude ) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా.. ‘ప్రేమలు’ బ్యూటీ మమితాబైజు (Mamita Baiju) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఒక మోస్తారు టాక్ తో దూసుకుపోతోంది. కీర్తి స్వరన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..కానీ అసలు ఈ కలెక్షన్స్ పై నిజాలు ఎంత అనే విషయం ఇప్పటికీ తెలియలేదు.
ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి అలరించిన ఒక హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆమె ఫోటోలు కూడా ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి . దీంతో ఈమె ఎవరు? అని తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో మమిత బైజుతో పాటూ నేహా శెట్టి (Neha Shetty) కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరితో పాటు క్లైమాక్స్లో తళుక్కుమని మెరిసి అందరినీ ఆకర్షించింది ఐశ్వర్య శర్మ (Aishwarya Sharma). ఈమె జమ్ము కాశ్మీర్ కి చెందిన మోడల్.. నటి కూడా.. డ్యూడ్ లో ఆమె క్లైమాక్స్ సీన్ నటన అందరిని విపరీతంగా అలరించింది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ తో కలిసి కొన్ని సన్నివేశాలలో కనిపించిన ఈమె ప్రస్తుతం నెటిజనులను భారీగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.
ALSO READ:Mirai: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సరికొత్త సంచలనం.. కుమ్మేశాడుగా!
దీంతో ఈమె కోసం గూగుల్ లో తెగ వెతికేయగా ఈమె బ్యాక్ గ్రౌండ్ కూడా బయట పడింది. ఐశ్వర్య శర్మ తమిళ ఇండస్ట్రీలోకి డ్యూడ్ సినిమా తోనే అడుగు పెట్టింది. కానీ తెలుగు సినిమాలలో ఇప్పటికే నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక విషయంలోకి వెళ్తే ఇటీవల వచ్చిన ‘డ్రింకర్ సాయి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతోనే తనకంటూ ఒక గుర్తింపును అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా నటించిన ధర్మ మహేష్ తో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ దీనిపై అసలు నిజం మాత్రం బయటపడలేదు. ఇక మరొకవైపు తన ఉనికిని చాటుకోవడానికి పలు చిత్రాలలో అవకాశాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తాజాగా తమిళ్ ఇండస్ట్రీలోకి డ్యూడ్ సినిమాతో అడుగుపెట్టి ఇప్పుడు ఓవర్ నైట్ లోనే అబ్బాయిల క్రష్ గా మారిపోయిన ఈమె.. మరిన్ని తమిళ్ చిత్రాలలో అవకాశాలు అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఒక్క నైట్ లో స్టార్ స్టేటస్ లభించడం అంటే ఇదేనేమో అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.