E-Paper
Advertisement

Sobhita dhulipala: జనాల గురించి ఆలోచిస్తే నా వ్యక్తిత్వం కోల్పోతాను -శోభిత

Sobhita dhulipala: జనాల గురించి ఆలోచిస్తే నా వ్యక్తిత్వం కోల్పోతాను -శోభిత
Advertisement

Sobhita dhulipala: ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita dhulipala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో.. అద్భుతమైన నటనతో.. పర్ఫెక్ట్ నిర్ణయాలతో కూడా అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకు నచ్చింది ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉండే ఈమె తాజాగా నటించిన చిత్రం ‘చీకటిలో’. 2024 డిసెంబర్లో నాగచైతన్య (Naga Chaitanya) ను వివాహం చేసుకున్న తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ సినిమా పైనే.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సురేష్ బాబు నిర్మాణంలో శరణ్ ఒప్పిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

నాదే తుది నిర్ణయం..

ఈ క్రమంలోనే చీకటిలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శోభిత తన వ్యక్తిగత అభిప్రాయాలతో పాటు వృత్తిపరమైన నిర్ణయాలను కూడా పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. నిన్నటికి నిన్నతన భర్త నాగచైతన్యతో తన సినిమాలకు సంబంధించిన విషయాలను చర్చిస్తాను. కానీ తుది నిర్ణయం తనదేనంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అలాగే సంక్రాంతి అంటే తనకు చాలా ఇష్టమని.. అందులో ముఖ్యంగా భోగి పండుగ అంటే మరింత ఇష్టమని చెప్పిన ఈమె.. వివాహం కాకముందు ముంబైలో ఉన్నప్పుడు కూడా సంక్రాంతికి వైజాగ్ కి వచ్చే దానిని అని చెప్పి సంక్రాంతి పండుగపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

జనాల ఆలోచనలతో నాకు పనేంటి?

Advertisement

అలాంటి ఈమె ఇప్పుడు జనాల గురించి చెప్పి పలు కామెంట్లు చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి తర్వాత వస్తున్న మొదటి సినిమా.. జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు? అని ప్రశ్నించగా.. శోభిత మాట్లాడుతూ..” నేను జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు. అందుకే వైజాగ్ లో నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు నచ్చిన పనులు మాత్రమే చేస్తున్నాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నా మనసుకు నచ్చిన పాత్రను ఎంచుకుంటున్నాను. ఈ విషయంలో నా భర్త నాగచైతన్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. నేను నమ్మిన ప్రాజెక్టును నిజాయితీగా చేస్తాను. నేను చేసే పని వల్ల జనాలు మెచ్చుకుంటారా ?ఇబ్బంది పడతారా? అని మాత్రం ఎప్పుడూ ఆలోచించను.
ఒక నటిగా నాకు వచ్చిన పాత్రకు 100% న్యాయం చేయడమే నా బాధ్యత ..మిగతాదంతా దేవుడి దయ” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ప్రేక్షకుల అభిప్రాయాల కోసం తన ఆలోచనలను మార్చుకోనని చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.

శోభిత కెరియర్..

శోభిత ధూళిపాళ విషయానికి వస్తే.. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రెండవ స్థానం సొంతం చేసుకున్న ఈమె.. అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలలో భారతదేశం తరుఫున పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది . వైజాగ్ లో స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె.. ముంబైలో హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ &ఎకనామిక్స్ పూర్తి చేసింది. భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకుంది.

Advertisement

ALSO READ: Rajinikanth: 37 ఏళ్ల తర్వాత విడుదలకు రజనీకాంత్ మూవీ.. వాయిదా వెనుక కారణం?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×