E-Paper
Advertisement

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!
Advertisement

Sobhita Dhulipala:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) పార్టీ పెట్టిన అనతి కాలంలోనే తమిళనాడుకి ఏకంగా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడంతో.. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు రాజకీయ రంగం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు అనే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే విశాల్ (Vishal), ధనుష్ (Dhanush) లాంటి హీరోలు తమిళ్ నాట రాజకీయ ప్రవేశం చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటే.. ఇటు టాలీవుడ్ లో మాత్రం అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్ (NTR) లాంటి హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వీరంతా ఎప్పటికప్పుడు పొలిటికల్ వార్తలపై ఖండిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్గా అక్కినేని పెద్ద కోడలు పొలిటికల్ ఎంట్రీపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈమె మాటల్ని బట్టి చూస్తే త్వరలోనే ఈమె రాజకీయ రంగ ప్రవేశం చేయనుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కచ్చితంగా ఆ పార్టీనే గెలుస్తుంది – శోభిత

ఒకవైపు సినిమాలు, సిరీస్ లు అంటూ.. అక్కినేని నాగచైతన్యత వివాహం తర్వాత మరింత బిజీగా మారిపోయిన శోభిత.. మరొకవైపు తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తూ బిజీగా మారింది. అంతేకా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై ర్యాంప్ వాక్ తో అదరగొట్టేస్తున్న విషయం తెలిసిందే. పైగా సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ.. ఇటు ఇంటర్వ్యూలలో సందడి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా.. శోభిత (Sobhita) మాట్లాడుతూ..” నాకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువ.. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కచ్చితంగా కమ్యూనిజమే విజయం సాధిస్తుంది” అంటూ చేసిన కామెంట్లు నెటిజన్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి.

శోభితపై నెట్టింట భిన్నాభిప్రాయాలు..

Advertisement

ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి తన పొలిటికల్ ఐడియాలజీని ఇంత పబ్లిక్ గా ఓపెన్ గా వెల్లడించడంపై జనాలు రెండు రకాలుగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో అవకాశాలు లభించేదే చాలా తక్కువ. అందుకే వారు ఎప్పుడూ కూడా వివాదాల జోలికి వెళ్లరు. అయితే శోభిత మాత్రం ఎలాంటి భయం , వెనుకు లేకుండా తన మనసులోని ఆలోచనలను స్పష్టంగా చెప్పడం నిజంగా అభినందనీయం అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇక ప్రతి ఒక్కరికి తమ సొంత రాజకీయ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంటుందని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.. గ్లామర్ రంగంలో నటిగా ఉంటూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న శోభిత కమ్యూనిజం, సామ్యవాదం గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అంటూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.మరికొంతమంది ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి అక్కినేని కోడలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

also read:జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న స్టార్ హీరో తల్లి.. ఎవరంటే?

శోభిత సినిమాలు..

Advertisement

శోభిత విషయానికి వస్తే.. వివాహం తర్వాత చీకటిలో అనే చిత్రం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. ప్రస్తుతం క్రాస్ రోడ్స్ అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 5న విడుదల అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం సిల్ బట్టా, వెట్టువం వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది శోభిత.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×