E-Paper
Advertisement

తండ్రులు సామ్రాజ్యాలు క‌ట్టారు.. కొడుకులు కూల‌గొట్టారు.. ఆ ఇద్ద‌రికీ ‘స‌న్’ స్ట్రోక్స్.. సీఎం యోగం ఉన్న‌ట్టా, లేన‌ట్టా?

తండ్రులు సామ్రాజ్యాలు క‌ట్టారు.. కొడుకులు కూల‌గొట్టారు.. ఆ ఇద్ద‌రికీ ‘స‌న్’ స్ట్రోక్స్.. సీఎం యోగం ఉన్న‌ట్టా, లేన‌ట్టా?
Advertisement

ఇక్క‌డ తండ్రులంటే స్టాలిన్‌, కేసీఆర్‌. కొడుకులంటే ఉద‌య‌నిధి స్టాలిన్‌, కేటీఆర్‌! ఈ తండ్రుల‌కే ఇప్పుడు *స‌న్* స్ట్రోక్ త‌గిలింద‌ని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చిందంటే.. త్రిష‌పై ఉద‌య‌నిధి కామెంట్స్ నేప‌థ్యం.. అరెస్టుతో దేశ వ్యాప్తంగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై చ‌ర్చ మ‌ల్లింది.

ఉద‌య‌నిధి స్టాలిన్‌ది రాజ‌కీయ వార‌స‌త్వ కుటుంబం. మంచిగా స్థిర‌ప‌డిన నేప‌థ్యం. అక్క‌డంతా వారిదే హ‌వా. సినిమా రంగంలో పెత్త‌న‌మంతా వారిదే. అలాంటి రాజ‌కీయాల మ‌ధ్య పుట్టి పెరిగిన ఉద‌య‌నిధి.. మొద‌ట సినిమాల‌పై దృష్టి పెట్టాడు. అక్క‌డ ప‌ర్వాలేద‌నిపించుకున్నాడే త‌ప్ప‌… స్టార్ ఇమేజీ సాధించ‌లేక‌పోయాడు. కానీ తండ్రికి మాత్రం కొడుకును సీఎం చేయాలేది ఆకాంక్ష‌.

Advertisement

అదే క‌దా అక్క‌డ కొన‌సాగుతూ వ‌స్తున్న వార‌స‌త్వ రాజ‌కీయం. అందుకే సినిమాల‌కు గుడ్ బై చెప్పించి రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చాడు. రాగానే రెడ్ కార్పెట్. ఏమాత్రం శ్ర‌మ లేకుండా.. ప్ర‌జానాడి తెలియ‌కుండా.. స‌మాజం ఎలా ఉందో క‌నీస అవ‌గాహ‌న లేకుండానే కీల‌క‌మై పార్టీ ప‌ద‌వి… ఆ త‌రువాత ఎమ్మెల్యే .. మంత్రి… డిప్యూటీ సీఎం దాకా వ‌రుస‌గా మెట్లెక్కేశాడు. తండ్రి స‌హ‌కారంతో.

అప్ప‌టికే నిర్మాణ‌మై ఉన్న సామ్రాజ్యంలో యువ‌రాజుగా వెలిగిపోయాడు. కానీ సీఎంను చేయాల‌నే ఆ తండ్రి క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. కొడుకును ఎప్పుడైతే రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చి.. ఇక కాబోయే సీఎం ఇత‌డేన‌ని ఆ జాతికి మొత్తం ప‌రిచ‌యం చేశాడో.. అప్పుడే మొద‌లైంది పార్టీ ప‌త‌నం. దీనికి తోడు కొడుకు చేష్ట‌లు. నోటి దురుసు మాట‌లు. చిన్నాపెద్దా తేడా లేకుండా సినిమా డైలాగులు వ‌ద‌ల‌డం.. దాని ప‌ర్య‌వ‌సానం ఎలా ఉంటుంద‌నే కనీస అవ‌గాహ‌న లేక‌పోవ‌డం.. ఇవ‌న్నీ డీఎంకే సామ్రాజ్యానికి బీట‌లు వేశాయి.

Advertisement

ప్ర‌జ‌ల్లో పెరిగిన ఈ వ్య‌తిరేకత‌ను గ‌మ‌నించే విజ‌య్ కొత్త రాజ‌కీయ పార్టీ అవ‌తారమెత్తింది. సరిగ్గా స‌మ‌యానికి వ‌చ్చి సీఎం సీటును త‌న్నుకుపోయాడు. తండ్రీకొడుకుల క‌ళ్ల‌ల్లో దుమ్ముకొట్టాడు విజ‌య్‌. అచ్చంగా ఇక్క‌డ తెలంగాణ రాజ‌కీయాల్లో కూడా ఇదే జ‌రుగుతూ వ‌చ్చింది. కానీ అక్క‌డ స్టాలిన్‌కు ఉన్నంత రాజ‌కీయ నేప‌థ్యం కేసీఆర్‌కు లేదు. కానీ క‌ష్ట‌ప‌డి ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌చ్చాడు. త‌న‌కు స‌హ‌జంగానే ఉన్న రాజ‌కీయ అవ‌గాహ‌న‌, ప‌రిస్థితుల‌ను ఆక‌ళింపు చేసుకుని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే చాతుర్యం క‌లిసి వ‌చ్చాయి.

తెలంగాణ ఉద్య‌మం కేసీఆర్‌ను హీరోను చేసింది. కేసీఆర్ కూడా ఆ ఉద్య‌మాన్నే ఊతంగా తీసుకుని ఎదిగాడు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ త‌న‌కంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకోగ‌లిగాడు. ఇక్క‌డా కొడుకు ఎంట‌ర్ కాగానే ప‌రిస్థితులు తారుమార‌వుతూ వ‌చ్చాయి. ప‌దేళ్ల పాల‌న‌లో కొడుకు షాడో సీఎంగా వ్య‌వ‌హ‌రించాడు. పార్టీ ప‌త‌నానికి, ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డానికి కేటీఆర్ చ‌ర్య‌లూ ఓ ప్ర‌ధాన కార‌ణంగానే ఉన్నాయి.

దీనికి తోడు కేసీఆర్‌కు ఉన్న ఏకైక రాజ‌కీయ ల‌క్ష్యం.. కేటీఆర్‌ను సీఎం చేయ‌డ‌మే. అది జ‌నానికి తెలిసిపోయింది. పార్టీలో కూడా తేలిపోయింది. అంతే కేసీఆర్ ప్లేస్‌లో ఇక కేటీఆర్ ఉంటాడు.. అనే నిజాన్ని వాళ్లే జీర్ణించుకోలేక‌పోయారు. అంతే ఇటు పార్టీ, అటు జ‌నం.. మెల్ల‌గా బీఆరెస్‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చారు.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలంటూ కొత్త వేషం క‌ట్టే ప్ర‌య‌త్నం తెలంగాణ స‌మాజానికి సుతార‌మూ న‌చ్చ‌లేదు. అందుకే ఇద్ద‌రికీ చెక్ పెట్టాలంటే ఓడ‌గొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదే చేసి చూపించారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్ర‌ల్లో తండ్రుల‌ది ఒకే ఒక కోరిక‌. కొడుకులను సీఎం చేయ‌డం. అది సాధ్య‌మ‌వుతుందా? అంటే .. ప‌రిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవ‌నైతే చెప్పాల్సి ఉంటుంది.

Tags

Related News

హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి పై భారీ స్కెచ్చేసిన బీఆర్ఎస్!

బ్లాక్‌మెయిల్ ఎమ్మెల్యేల‌కు ఇదే క‌రెక్టు ధమ్కీ.. ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి..!

ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!

లివింగ్ రిలేషన్‌షిప్‌పై సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జ్‌మెంట్!

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

Big Stories

Advertisement
×