Film industry: సాధారణంగా ఒక మనిషికి 60 లేదా 70 సంవత్సరాల వయసు వచ్చింది అంటే కృష్ణా రామా అంటూ ఒక మూలన కూర్చుంటారు అనే సామెత ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఈ మధ్యకాలంలో 60 కాదు కదా 80 సంవత్సరాలు వయసు వచ్చినా.. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని ఎంతోమంది నిరూపిస్తున్నారు. అందులో ఒకరు ప్రముఖ స్టార్ హీరో తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 71 సంవత్సరాల వయసులో కూడా ఎంతో చలాకీగా వర్కౌట్స్ చేస్తూ.. కఠినమైన బరువులు మోస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. పైగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తన జిమ్ వర్కౌట్ కి సంబంధించిన వీడియోలను, ఫోటోలను పంచుకుంటూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు.
71 ఏళ్ల వయసులో జిమ్ వర్కవుతో అదరగొట్టేస్తున్న హీరో తల్లి..
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) తల్లి పింకీ రోషన్(Pinkie Roshan). నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె 71 ఏళ్ల వయసులో కూడా ఇంకా 30ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. రెగ్యులర్ వ్యాయామం చేస్తూ, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ, శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటున్నారు. నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
also read:ప్రదీప్ రావత్ జీవితంలో భయంకరమైన రోజు అదే!
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తన జిమ్ వర్కౌట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శారీరక,మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. అలాంటి ఈమె తాజాగా మరో వర్కౌట్ వీడియోతో ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నోరెళ్ళ పెడుతున్నారు. ఇందులో ఆమె డంబెల్ స్క్వాట్స్, లాట్ ఫుల్ డౌన్స్, డంబెల్ ప్రెసెస్ వంటివి చేస్తూ ఆశ్చర్యపరిచారు. వయసు మీద పడుతున్నా మృతిక్ రోషన్ తల్లి ఇలా వ్యాయామం చేయడం ఎంతోమంది వృద్ధులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని చెప్పాలి.
ఏంటీ? HHH రూల్ అంటే శరీరం, మనసు మధ్య బ్యాలెన్స్ ఉండేలా వర్కౌట్స్ చేస్తున్నట్లు సమాచారం.గతంలో కూడా ఈమె ఇలాంటి వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు .ఏది ఏమైనా బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని పిలుచుకునే హృతిక్ రోషన్ పర్ఫెక్ట్ ఫిజిక్ తో హాలీవుడ్ హీరోలను తలదన్నేలా అందరినీ ఆశ్చర్యపరిస్తుంటే.. ఆయనను మించి ఫిట్ గా జిమ్లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు ఆయన తల్లి పింకీ రోషన్. ఇటీవల ఆయన తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో అవి చూసిన కొంతమంది మీ అక్క అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కొడుకుతో పోటీపడుతూ ఫిట్నెస్ విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు పింకీ రోషన్.