E-Paper
Advertisement

Sobhita: నవీన్ పోలిశెట్టికి షాక్ ఇచ్చిన శోభిత.. సామ్ గుర్తులను పూర్తిగా చెరిపేస్తోందిగా?

Sobhita: నవీన్ పోలిశెట్టికి షాక్ ఇచ్చిన శోభిత.. సామ్ గుర్తులను పూర్తిగా చెరిపేస్తోందిగా?
Advertisement

Sobhita: శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య (Nagachaitanya)ను గత ఏడాది వివాహం చేసుకొని అక్కినేని కోడలుగా కొనసాగుతున్నారు. ఇక నాగచైతన్య సమంత(Samantha) విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభిత (Sobhita)వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల నాగచైతన్య శోభిత కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హీరో సుశాంత్, నవీన్ పోలిశెట్టి వంటి తదితరులు కూడా పాల్గొన్నారు.

చై కాదు చైతూ అని పిలవండి..

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి వేదికపై మాట్లాడుతూ చై ఇటు రా నువ్వే ఇక్కడ మెయిన్ అని మాట్లాడారు వెంటనే శోభిత అందుకొని తనని చై అని కాదు చైతూ అని పిలవండి అంటూ కాస్త సీరియస్ గానే చెప్పారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నాగచైతన్యను సమంత చై అని పిలిచేది.. దీంతో చైతన్య’ చై’ గానే అందరికీ పరిచయం కానీ సమంత జ్ఞాపకాలను, గుర్తులను చెరిపేసే పనిలో శోభిత ఉన్నారని తాజాగా ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

సమంత చై అని పిలిచేది..

Advertisement

నాగచైతన్యను ఇకపై ఎవరు చై అని పిలవకూడదు అంటూ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. అలా పిలవడం శోభితకు నచ్చలేదని అందుకే అంత సీరియస్ అయ్యారు అంటూ మరి కొంతమంది ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా క్రమక్రమంగా శోభిత నాగచైతన్య, సమంతకు సంబంధించి జ్ఞాపకాలను తుడిచేస్తున్నారు. ఇక నాగచైతన్య శోభిత ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె కూడా దర్శకుడు రాజ్ ను రెండవ వివాహం చేసుకున్నారు.

Advertisement

ఇక నాగచైతన్య కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం చైతన్య కార్తీక్ వర్మ దరకత్వంలో వృషకర్మ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా మైథాలజికల్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక చైతు చివరిగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీక్ వర్మ వృషకర్మ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Also Read: Chinmayi: చిన్మయి ఫోటోలు మార్ఫింగ్… డబ్బులు కోసమే ఇలా అంటూ ఫైర్ అయిన సింగర్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×