E-Paper
Advertisement

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట
Advertisement

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ZPHS స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రం సమీపంలో గుమికూడి, ఓటర్లకు తమ పార్టీ గుర్తులను చూపిస్తూ ప్రచారం చేసినట్లు సమాచారం. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని గుర్తించిన పోలింగ్ అధికారి అడ్డుకోవాలని ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీస్ బలగాలు వెంటనే దిగి వచ్చి కార్యకర్తలను వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొంతసేపు అక్కడ గందరగోళం నెలకొనగా.. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని నియంత్రించారు.

Advertisement

ఈ ఘటనతో పోలింగ్ సెంటర్ వద్ద కొద్ది సమయంలో ఓటింగ్ నిలిచిపోయింది. తర్వాత పరిస్థితిని సమీకరించిన అధికారులు ఓటర్లను భరోసా ఇచ్చి పోలింగ్ మళ్లీ ప్రారంభించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సంబంధిత కార్యకర్తలపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల అధికారు లు నివేదికలు సేకరిస్తున్నారని సమాచారం.

మణుగూరులో జరిగిన ఈ సంఘటన స్థానిక రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపగా, పోలింగ్ సజావుగా సాగేందుకు పోలీసులు అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×