BigTV English
Advertisement

Sai Tej : సాయి తేజ్ పై ట్రోల్స్, జానీ మాస్టర్ ను ఎందుకు వదిలేసినట్టు

Sai Tej : సాయి తేజ్ పై ట్రోల్స్, జానీ మాస్టర్ ను ఎందుకు వదిలేసినట్టు

Sai Tej : మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్లలో సాయిధరం తేజ్ ఒకరు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించుకోలేకపోయింది. ఆ తర్వాత కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. అయితే సాయి ధరం తేజ్ కెరియర్ లో సక్సెస్ఫుల్ సినిమాలు కంటే కూడా ఫెయిల్యూర్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి.


అయితే ఈ విషయాన్ని చాలామంది మెగా అభిమానులు దృష్టిలో పెట్టుకొని స్టోరీ సెలక్షన్స్ లో మీ మామయ్యను మించిపోయేలా ఉన్నావు కదా అన్నా అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు. అయితే సాయి తేజ్ కెరియర్ లో కూడా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. రిపబ్లిక్ సినిమాకి మంచి అప్లాస్ వచ్చింది. కేవలం సినిమాల్లో హీరో గానే మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు సొసైటీ గురించి, చైల్డ్ అబ్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు తేజ్. ఇది కూడా చాలామందిని ఆకర్షిస్తుంది.

సాయి తేజ్ పై ట్రోల్స్ 

ఒక విషయం గురించి ప్రస్తావించినప్పుడు ఆ మనిషి గురించి పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎలా అయితే ఉంటారో, అలానే నెగిటివ్ గా మాట్లాడే వాళ్లు కూడా ఉంటారు. గతంలో సాయి తేజ ఒక ఇష్యూను లేవదీశారు. ఒక చిన్న పిల్ల పైన కొంతమంది చేసిన కామెంట్స్ సాయి తేజ్ ను బాగా కదిలించాయి. అయితే ఆ విషయం పైన మీడియా స్పందిస్తారు ఏమో అని 24 గంటల పాటు ఎదురుచూశాడు. కానీ ఎవరూ స్పందించకపోవడంతో సాయి తేజ్ రంగంలోకి దిగి. ప్రభుత్వ అధికారులను గవర్నమెంట్ ని ఏకంగా ట్యాగ్ చేసి అందరికీ శిక్ష పడేలా చేశారు. దీనిని కొంతమంది ప్రశంసించారు. ఇంకొంతమంది ఎదురు తిరుగుతూ ట్రోల్స్ చేస్తున్నారు.


ఏ విషయంలో ట్రోల్స్.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ ఒకరు. తన స్వశక్తితో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ అంటే రామ్ చరణ్ తేజ్ కు కంపోజ్ చేసిన సాంగ్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు కూడా పెద్ది సినిమాలో చరణ్ కోసం ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా సాయి తేజ్ మాట్లాడుతూ సోషల్ మీడియాను తగలెట్టాలి అనిపించింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఈ స్టేట్మెంట్ కూడా ఆ పసిపిల్ల పైన చేసిన కామెంట్స్ వలన వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే పాయింట్ పట్టుకొని సృష్టి వర్మ అనే అమ్మాయి కూడా చిన్నపిల్ల కదా, అటువంటి పిల్లపై జానీ మాస్టర్ ఇలా చేశారు కదా, దీని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి జానీ మాస్టర్ విషయంలో జరిగిన దాని గురించి ఎవరికీ క్లారిటీ లేదు. ఒకవేళ క్లారిటీ వచ్చినట్లయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని కూడా చెప్పొచ్చు.

Also Read: Bigg Boss: ఒరేయ్ సంజన ఏంట్రా అంత సీరియస్ సిచువేషన్ లో తెలియకుండా కామెడీ చేస్తుంది

Related News

Mass jathara: మాస్ జాతర కలెక్షన్స్.. మరీ ఇంత దారుణం అయితే ఎలా బాసూ!

Bahubali The Epic Collections : ‘బాహుబలి ది ఎపిక్’ కలెక్షన్ల కోత..రెండు రోజులకు ఎన్ని కొట్లంటే..?

Prashanth Varma: ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి… ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాత కంప్లైంట్

Dragon NTR Look Leak : డ్రాగన్ మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ లీక్.. ఏమున్నాడురా హీరో..

Star Heros : భార్యలకు విడాకులు ఇచ్చిన టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్స్ తో ఎఫైర్స్..?

Prasanth Varma : నిర్మాతలతో హనుమాన్ డైరెక్టర్ గొడవలు.. ‘జై హనుమాన్’ ఇప్పట్లో రాదా..?

Geethika : బికినీలో అందాలతో కుర్రాళ్ళను ఉడికిస్తున్న అహింస హీరోయిన్.. బాపురే కష్టమే..

SSMB29 : మహేష్ బాబు, రాజమౌళి ట్విట్టర్ వార్, అప్డేట్ ఇస్తావా లేదా?

Big Stories

×