Ram Gopal Varma:కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పుడు సమాజంలో జరిగే విషయాలపై, రాజకీయాలపై స్పందించే రాంగోపాల్ వర్మ ఈమధ్య ఎక్కువగా సినిమాలపై అలాగే సినిమాలలో నటిస్తున్న నటీనటులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న సినిమాపై తేజ సజ్జా మిరాయ్ సినిమాపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న వర్మ.. ఈరోజు అదే సినిమాలో విలన్ గా నటించిన మంచు మనోజ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ కూడా పంచుకోవడం జరిగింది.
వర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా.. “తేజ సజ్జా మిరాయ్ సినిమా చూసిన తర్వాత చివరిగా వీఎఫ్ఎక్స్ ఇంత గ్రాండ్ గా ఎప్పుడు అనిపించిందో కూడా నాకు గుర్తులేదు.. దాదాపు రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేసిన సినిమాల్లో కూడా ఇంత అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ను చూపించలేదు.ఇందులో మంచు మనోజ్ నిన్ను విలన్ గా మిస్ కాస్ట్ చేశారని అనుకున్నాను. కానీ నీ నటన చూసి నన్ను నేను ఆశ్చర్యపోయి.. చెంప దెబ్బ కొట్టుకున్నాను. ఇక తేజ నువ్వు ఇంత పెద్ద ఎత్తున యాక్షన్ చేయడానికి చాలా చిన్నవాడివిగా కనిపిస్తావేమో అని సినిమా విడుదల కాకముందు అనిపించింది. విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు, స్క్రీన్ ప్లే నిర్మాణం అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు విజయం అంటే అది నువ్వు కన్న అద్భుతమైన కలలాగా నాకనిపిస్తోంది. హీరోయిజం కలిపిన దృశ్య రంగుల్లో చల్లబడిన పురాణం మీది. ఇది దాని ఆశయాన్ని, ముఖ్యంగా దాని అద్భుతమైన కథను వాస్తవిక లో సాధిస్తుంది. ముఖ్యంగా ఎవరి నుండి ఎటువంటి సపోర్టు లేకపోయినా.. మీరు మీపై నమ్మకం ఉంచి, మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. సినిమా చేసేది లాభం గురించి మాత్రమే కాదు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను కూడా అందిస్తాయి అని ఈ సినిమా నిరూపించింది.. చివరిగా నేను చెప్పొచ్చేదేమిటంటే.. ఇది చిన్న సినిమా కాదు చాలా పెద్ద ప్రాజెక్టు.. ఈ సినిమా ప్రజలలోకి వెళ్లడానికి చిత్ర బృందం మరింత కష్టపడుతుంది” అంటూ వర్మ తన ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:Mirai Part 2 : పార్ట్ 2లో ఐటమ్ సాంగ్… వైబ్ సాంగ్ పరిస్థితి ఏంటంటే?
మిరాయ్ సినిమా విశేషాలు..
మిరాయ్ సినిమా విశేషానికి వస్తే.. తేజ సజ్జ హీరోగా.. రితిక నాయక్ హీరోయిన్ గా సెప్టెంబర్ 12వ తేదీన చాలా గ్రాండ్ గా ఈ సినిమా విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో కృతి ప్రసాద్ సహనిర్మాతగా వ్యవహరించారు. సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ ఆరంభించిన కార్తిక ఘట్టమనేని.. ఈ సినిమాతో డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. మంచి సక్సెస్ అందుకున్నారు. ఇందులో శ్రియా శరణ్ తో పాటు స్టార్ హీరో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. వారి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయగా.. రెండవ రోజు రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ తో సహా విడుదల చేశారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
After seeing #Mirai , I don’t remember the last time VFX felt so grand , even in the so called + 400 cr films
Hey @HeroManoj1 I thought you were miscast as the villain , and I slapped myself after seeing your terrific portrayal 🔥🔥🔥
Hey @tejasajja123 I thought you might…
— Ram Gopal Varma (@RGVzoomin) September 14, 2025