Psoriasis Health Tips: సోరియాసిస్ అనేది చర్మానికి సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది సాధారణమైన చర్మ రోగం కాదని వైద్యులు చెబుతారు. ఒకసారి వస్తే పూర్తిగా పోయే వ్యాధి కాదు, కానీ సకాలంలో చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనికి ముఖ్య లక్షణం చర్మంపై ఎర్రగా, పొడిబారిన మచ్చలు ఏర్పడటం. ఆ మచ్చలపై తెల్లటి పొరలు ఏర్పడి తరచూ తొలగిపోతూ ఉంటాయి. ఈ సమయంలో దురద, నొప్పి కూడా ఇస్తుంది.
చాలా మందికి ఇది చిన్నచిన్న మచ్చలుగా వస్తుంది. సోరియాసిస్ అనేది అంటురోగం కాదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. కానీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ. మన రోగనిరోధక వ్యవస్థలో తలెత్తే సమస్యలే దీని ప్రధాన కారణం. కొన్నిసార్లు గాయాల్లా కూడా మారి చాలా ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తాయి. దీని పూర్తి చికిత్స మాత్రం వైద్యుల సలహా ప్రకారమే చేయించుకోవాలి. అయితే సహజమైన పద్ధతులు ఇంట్లో పాటిస్తే ఉపశమనం త్వరగా లభిస్తుంది. అలాంటి ఒక చిట్కా బనానా తొక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కలతో మరిగించిన నీరు.
Also Read: Tirupati Crime: తిరుపతిలో దారుణం.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు..
మనకు సాధారణంగా ఉపయోగించే ఈ పదార్థాల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అరటి తొక్కలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రం చేస్తాయి, చర్మానికి తేమను అందిస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలో ఉన్న వాపులను తగ్గించి ఇన్‌ఫెక్షన్‌లను దూరం చేస్తాయి. బిర్యానీ ఆకు రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని లోపలినుంచి శుభ్రం చేస్తుంది. దాల్చిన చెక్క యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇవన్నీ కలిసి శరీరానికి శక్తివంతమైన సహజ ఔషధంలా పనిచేస్తాయి.
ఎలా తయారు చేయాలి?
ఇది తయారు చేయడం చాలా సులభం. ఒక లీటర్ నీటిలో అరటి తొక్క ముక్కలు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించి తర్వాత వడకట్టాలి. ఆ నీటిని గోరువెచ్చగా తాగితే శరీరంలో విషపదార్థాలు తొలగి రక్తం శుద్ధి అవుతుంది. క్రమంగా సోరియాసిస్ వల్ల కలిగే దురద, మంట, ఎరుపు మచ్చలు తగ్గిపోతాయి.
ఈ పద్ధతి పూర్తిగా సహజమైనది కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే దీన్ని ఒక సహాయక చికిత్సగా మాత్రమే భావించాలి. సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. సహజ చికిత్సలు శరీరానికి మేలు చేస్తాయి, చర్మం క్రమంగా ఆరోగ్యంగా మారడానికి తోడ్పడతాయి. క్రమం తప్పకుండా ఈ మరిగించిన నీటిని తాగితే ఉపశమనం త్వరగా లభిస్తుంది.