Tirupati Crime: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాకాల మండలంలోని మూలవంక అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగింది?
మూలవంక అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒకరు పురుషుడు, మరొకరు మహిళగా గుర్తించారు. చెట్టుకు ఉరి వేసుకున్న వ్యక్తి పురుషుడిగా, మరొకరు సంఘటనా స్థలంలో మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే మరో షాకింగ్ విషయం ఏమిటంటే అక్కడే ఏవరినో పూడ్చి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ తవ్వి చూడగా అందరూ షాక్‌కి గురయ్యారు. అక్కడ చిన్న పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం, పిల్లలను ముందుగానే చంపి, వారిని పూడ్చిపెట్టి, ఆ తరువాత దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది? కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు ఉండటంతో, ఇది చాలా రోజుల క్రితమే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: September 22 GST: సెప్టెంబర్ 22 తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయా? నిజం ఏమిటి?
ఆర్థిక సమస్యలతోనే కుటుంబం మొత్తం ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. పిల్లలను చంపిన వెంటనే భార్యను కూడా చంపి, తరువాత భర్త ఉరి వేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే వీరు స్వయంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక ఎవరైనా వీరిని చంపి అడవిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనేది మరో కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దంపతులు ఎవరు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు? అనేది అనుమానంతో స్థానికుల వద్ద పోలీసులు ఆరా తీస్తున్నారు. చిన్న పిల్లలను సైతం చంపి, ఇద్దరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం పై మూలవంక అటవీ ప్రాంతంలో భయాందోళనకు గురిచేస్తుంది.