Mitchell Starc : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్తితి. అయితే కేవలం ఆటలో మాత్రమే కాదు.. ఈ మధ్య ఆటగాళ్లు కూడా మారిపోతున్నారు. ముఖ్యంగా కొందరూ ఒకానొక సందర్భంలో అద్భుతమైన ఫామ్ ని కనబరిస్తే.. మరికొందరూ అస్సలు ఫామ్ లో లేకుండా పోతున్నారు. ఇలా నిత్యం జరుగుతున్నాయి. కానీ తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ లేడీగా మారి పూజలు చేస్తున్నాడని ట్రోలింగ్స్ చేస్తున్నారు.
Also Read : IND VS PAK : ఇదే జరిగితే…ఆసియా కప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ ?
అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలో అచ్చం మిచెల్ స్టార్క్ పేస్ మాదిరిగానే ఉన్న ఓ మహిళా పూజలు చేస్తోంది. ఓ దేవాలయం వద్ద దీపాలతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అయితే స్టార్క్ ఇలా మారాడేంటి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్క్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నది మాత్రం స్టార్క్ కాదండోయ్. స్టార్క్ మాదిరిగానే ఉండటంతో స్టార్క్ ని ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ-20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. టెస్ట్ లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని వెల్లడించాడు. ఐపీఎల్ సహా దేశవాళీ టీ-20 లీగ్ లకు కూడా అందుబాటులో ఉంటానని తెలిపారు. 35 ఏళ్ల స్టార్క్ 2024 టీ-20 వరల్డ్ కప్ నుంచి టీ-20 ఫార్మాట్ కి దూరంగా ఉంటున్నాడు.
స్టార్క్ ఆస్ట్రేలియా తరపున పేసర్లలో లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఓవరాల్ గా ఆడమ్ జంపా 130 తరువాత ఆస్ట్రేలియా తరపున రెండో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. టీ-20 ఫార్మాట్ లో స్కార్ట్ 021 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఆసీస్ విజేతగా నిలిచింది. టీ-20లలో ఆస్ట్రేలియా జట్టుకు అదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం. టీ-20 కెరీర్ లో ప్రతీ మ్యాచ్ ను, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించానని స్టార్క్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా తరపున పొట్టి ఫార్మాట్ ను ఆడటాన్ఇన బాగా ఎంజాయ్ ఏశానని చెబుతూనే.. టెస్ట్ లకే తన తొలి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు. మరోవైపు భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తానని తెలిపాడు. ఈ టోర్నీలకు ఫిట్ గా, ఫ్రెష్ గా ఉండటానికి అంతర్జాతీయ ఈ-20లకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పలేదని తెలిపాడు. 2012లో అంతర్జాతీయ టీ 20 అరంగేట్రం చేసిన స్టార్క్ ఈ ఫార్మాట్ లో 65 మ్యాచ్ లు ఆడి 7.74 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని 79 వికెట్లు తీశాడు. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా క్రికెట్ కి పలువురు రిటైర్మెంట్ ప్రకటించారు. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. స్టార్క్ మాత్రం టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) September 13, 2025