BigTV English

Tollywood Heroine: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!

Tollywood Heroine: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!

Tollywood Heroine:ఈ మధ్యకాలం సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లు చేసుకొని.. ఇలా తల్లిదండ్రులవుతున్నారు. మరికొంతమంది పెళ్లయిన తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టి, ఆ తరువాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్ కూడా తల్లిగా ప్రమోట్ అవుతున్నాను అంటూ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తన మెటర్నిటీ ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా.. ఆమె ఎవరో కాదు సోనారిక.


తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్..

తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించిన ఈ చిన్నది.. అందం, అభినయంతో విపరీతంగా ఆకట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపును అందుకోలేకపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రియుడుతో కలిసి ఏడు అడుగులు వేసిన ఈమె.. ఇప్పుడు అభిమానులకు శుభవార్త తెలిపింది. అందులో భాగంగానే తాను గర్భవతిని అంటూ ఈ విషయాన్ని రివీల్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోషూట్ కూడా పంచుకుంది. ప్రస్తుతం భర్తతో కలసి దిగిన మెటర్నిటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సోనారిక పెళ్లి..


దాదాపు 8 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సోనారిక.. 2022లో తన ప్రియుడు వ్యాపారవేత్త వికాస్ పరశార్ తో నిశ్చితార్థం చేసుకుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయిన ఈమె.. ఇప్పుడు తల్లి కాబోతున్నట్లు తెలిపింది.

సోనారిక సినీ కెరియర్..

ఈమె సినీ కెరియర్ విషయానికి వస్తే.. జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం అనే చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినా.. పెద్దగా గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. 2022లో ‘హిందుత్వ’ అనే హిందీ సినిమాలో చివరిగా నటించింది.

also read:Ram Gopal Varma: మంచు మనోజ్ పై వర్మ ఊహించని కామెంట్.. అంత మాట అన్నారేంటి?

సినిమాలలో హీరోయిన్ మాత్రమే కాదు సీరియల్స్ లో కూడా..

ఇకపోతే సోనారిక సినిమాలతోనే కాదు సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీ సీరియల్స్ తో మరింత పాపులారిటీ అందుకుంది ఈ చిన్నది. దేవాన్ కే దేవ్ మహాదేవ్ అనే సీరియల్ లో పార్వతి దేవిగా కనిపించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది సోనారిక. అలాగే పృథ్వీ వల్లభ్ – ఇతిహాస్ భీ రహస్య భీతో పాటు దస్తాన్ ఇ మొహబ్బత్ సలీం అనార్కలి వంటి సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది.

సోనారిక బాల్యం, విద్యాభ్యాసం..

భడోరియా చంబల్ నదీ ప్రాంతంలోని రాజ్ పుత్ వంశానికి చెందిన ఈమె 1992 డిసెంబర్ 3న జన్మించింది. ముంబైలో పెరిగిన ఈమె యశోధం హైస్కూల్లో చదివి ముంబైలోని డీజి రూపరెల్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాతృతపు క్షణాలను అనుభవించడానికి సిద్ధమైన ఈమె అందులో భాగంగానే ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తోంది. త్వరలోనే పండంటి బిడ్డకు బాబుకు జన్మనివ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Shivani Nagaram: బ్రేకప్ దెబ్బ.. అలాంటి వాడే భర్తగా రావాలంటున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ!

Betting Apps: బాలీవుడ్ వంతు.. ఆ స్టార్ హీరోయిన్స్ కి ఈడీ నోటీసులు!

Sai Tej : సాయి తేజ్ పై ట్రోల్స్, జానీ మాస్టర్ ను ఎందుకు వదిలేసినట్టు

Ram Gopal Varma: మంచు మనోజ్ పై వర్మ ఊహించని కామెంట్.. అంత మాట అన్నారేంటి?

Mirai Part 2 : అందుకే నిధి అగర్వాల్ ఐటెమ్ సాంగ్ దాచాం.. మరి వైబ్ సాంగ్ పరిస్థితి ఏమిటీ?

Sai Durga Tej: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన మెగా మేనల్లుడు.. అమ్మాయి ఎవరంటే?

SSMB 29: కెన్యా షెడ్యూల్ కంప్లీట్.. నెక్స్ట్ ఎక్కడంటే?

Big Stories

×