Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela)ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన ఈమె ఇటీవల కాలంలో తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే శ్రీ లీల నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీ లీల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పుష్ప 2(Pushpa 2) సినిమాలోని కిస్సిక్ పాట(Kissik Song) గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని బాలీవుడ్ లో కూడా భారీగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల నటించి ప్రేక్షకులను మెప్పించారు ఈ పాట ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా శ్రీ లీలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ విషయం గురించి శ్రీ లీల మాట్లాడుతూ..
పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ పాట తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని ఈ పాట తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మంచి ప్లాట్ ఫామ్ అయ్యిందని తెలిపారు. ఒకవేళ తాను ఈ పాట చేయకపోయి ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అంత త్వరగా అవకాశాలు వచ్చేవి కాదేమో అంటూ శ్రీ లీల వెల్లడించారు. ఇలా ఈ పాట ద్వారా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఆషికి 3, దోస్తానా 2 వంటి బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి గల వ్యత్యాసాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.
బాలీవుడ్.. టాలీవుడ్ అదే తేడా..
ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో ఏ విధమైనటువంటి తేడా ఉండదని అదే సెట్, అదే ఎమోషన్ , ఇక నా టీమ్ మొత్తం అక్కడ కూడా ఉంటారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏదైనా తేడా ఉంది అంటే అది కేవలం భాష మాత్రమేనని, మిగిలినదంతా సేమ్ టు సేమ్ అంటూ శ్రీ లీల తెలియ చేశారు. ఇక మాస్ జాతర విషయానికి వస్తే.. రవితేజతో ధమాకా తర్వాత నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్స్, పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలని పెంచేసాయి. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాగా నవంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రచయితగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న భాను భోగ వరపు మొదటిసారి దర్శకుడిగా మారి మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Venkatesh -Aishwarya Rajesh: వెంకీమామ సినిమాలో ఐశ్వర్య రాజేష్.. మరో హిట్ లోడింగ్?