Mahhi Vij and Jay Bhanushali Divorced: మరో స్టార్ కపుల్ విడాకులు బాట పట్టింది. పెళ్లయిన 14 ఏళ్ల తర్వాత తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకి ఆ జంట ఎవరంటే మహి విజ్ (Mshi Vij), జే భానుషాలిల (Jay Bhanushali). బుల్లితెర స్టార్స్ అయిన ఈ జంట కొన్నాళ్ల క్రితమే విడాకులకు అప్లై చేశారట. గత ఆగస్టులో విడాకులు మంజూరు అయినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా కొన్ని రోజులు ఈ జంట విడివిడిగా నివసిస్తున్నారంట. దీంతో మహి, జేలు విడాకులు తీసుకున్నారంటూ కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే వీరి విడాకులు కూడా అయిపోయాయని, తమ ముగురి పిల్లలను కూడా పంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మహి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. ‘స్క్రీన్ షాట్ లో ఉండే వస్తువులను కొనుక్కునేందుకు మన దగ్గర ఎల్లప్పుడు డబ్బులు ఉండాలి‘ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టు వారి విడాకులు రూమర్స్ కి మరింత బలం చేకూర్చేల ఉంది. అంతేకాదు తన ఇన్స్టాగ్రామ్లో కూడా భర్త జే భానుషాలికి సంబంధించిన పోస్ట్స్ అన్ని కూడా డిలిట్ చేసింది. దీంతో వీరిద్దరు విడిపోయారని అంత ఫిక్స్ అయిపోయారు. కేవలం పిల్లలతో ఉన్న ఫోటోలను మాత్రమే ఉన్నాయి.. భర్తతో ఉన్న ఒక్క పోస్టు కూడా లేకపోవడం గమనార్హం.
ఆగస్టులో కోర్టు కూడా వీరి విడాకులు మంజూరు చేయడం ఆఫీషియల్గా వీరి భార్యభర్తల బంధం ముగిసిపోయిందట. దీనిపై ఈ జంట అధికారిక ప్రకటన లేదు కానీ, బి–టౌన్లో మాత్రం గట్టి ప్రచారం జరుగుతుంది. గతంలోనూ వీరి విడాకుల వార్తలు వినిపించగా.. మహి స్పందించింది. ఒకవేళ నిజంగా తాము విడిపోయిన.. మీకేందుకు నిజం చెప్పాలి. మీరేమైనా మా లాయర్ ఫిజు కడతారా? మీరేమైన మా చుట్టాలా.. అవకాశం దొరికితే ఎవరోకరిని విమర్శించడం తప్ప మరే పనిలేదా అని మీడియాపై అసహనం చూపించింది. కాగా మహి విజ్.. తెలుగులో తపన అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె మరే సినిమాల్లోనూ కనిపించలేదు.
Also Read: Bigg Boss 9 : హౌస్‌లో భరణికి తీవ్రగాయాలు.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలింపు
తమిళ్, కన్నడ భాషల్లో ఒక్కొ సినిమా చేసిన ఆమె ఇక బాలీవుడ్కి మకాం మార్చేసింది. అక్కడ ఆడపదడప చిత్రాలు చేసిన ఆమె ఇక బుల్లితెరపై సీరియల్ నటి సెటిలైపోయింది. పల సీరియల్లో లీడ్ రోల్ పోషించిన ఆమె జే భానుషాలి ప్రేమ పెళ్లి చేసుకుంది. జే భానుషాలి హేట్ స్టోరీ 2 లో కీలక పాత్ర పోషించాడు. బుల్లితెరపై సింగింగ్, డ్యాన్స్ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. నాచ్ బలియే అనే డ్యాన్స్ లో వీరిద్దరు జంటగా పాల్గొని ఆ సీజన్ విజేతగా నిలిచారు. కాగా 2011లో పెళ్లి చేసుకున్న వీరి ఎంతకాలమైన పిల్లలు పుట్టకపోవడం ఒక పాప, ఒక బాబుని దత్తత తీసుకున్నారు. పిల్లల కోసం ఎంతో ట్రై చేసిన మహి ఐఫీఎఫ్ ద్వారా పిల్లలను కనాలి అనుకుంది. ఇలా మూడు సార్లు ప్రయత్నించగా రెండు సార్లు విఫలమైంది. మూడో సారి సక్సెస్ అవ్వడంతో వారికి తార అనే పాప జన్మించింది.