Dhaka plot to kill Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై హత్యకు భారీ కుట్ర జరిగిందా? అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఈ ప్రణాళిక రచించాయా? ఈ పెను ప్రమాదం గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా మోదీని హెచ్చరించి, ఆ కుట్రను భగ్నం చేశారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో, పలు అంతర్జాతీయ విశ్లేషణలలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 31న చైనాలోని టియాన్జాన్‌లో జరిగిన SCO సమ్మిట్‌లో చోటుచేసుకున్న అసాధారణ పరిణామాలు, అదే రోజు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక మిస్టరీ మరణం.. ఈ రెండు సంఘటనలను ముడిపెడుతూ ఈ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది.
ఆగస్టు 31న SCO సమ్మిట్ ముగిసిన తర్వాత, తన అధికారిక కారులో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు 40 నిమిషాల అత్యంత రహస్యంగా మాట్లాడారు. ఈ రహస్య మీటింగ్‌లో మోదీని హత్య చేసేందుకు అమెరికా భారీ ప్రణాళిక సిద్ధం చేసిందని.. దీనికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహకరిస్తున్నాయని పుతిన్ మోదీకి స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. “నాపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి. మీరు మాకు అత్యంత విలువైన మిత్రుడు.. జాగ్రత్త” అని పుతిన్ హెచ్చరించినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి.
పుతిన్-మోదీ భేటీ జరిగిన ఆగస్టు 31వ తేదీనే, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ హోటల్‌లో టెర్రేన్స్ జాన్సన్ అనే ఉన్నత స్థాయి అమెరికన్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇతను అమెరికన్ ఆర్మీలో 20 ఏళ్ల అనుభవం ఉన్న, ‘స్పెషల్ ఆపరేషన్స్ ఆఫ్ ఆసియా‘ విభాగానికి చెందిన కీలక వ్యక్తి అని సమాచారం. మోదీపై కుట్రను అమలు చేసే ఆపరేషన్ కోసమే టెర్రేన్స్ జాన్సన్ కొద్ది నెలలుగా ఢాకాలో మకాం వేశాడని, అక్కడి నుంచి కొందరు తీవ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు సిద్ధం చేశాడని ఈ విశ్లేషణలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎలాంటి పోస్ట్‌మార్టం నిర్వహించకుండా, ఈ మరణాన్ని ‘సహజ మరణం’గా చిత్రీకరించి, అమెరికా అధికారులు అతని మృతదేహాన్ని హడావుడిగా తరలించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పుతిన్ నుండి అందిన పక్కా సమాచారంతో భారత ‘రా‘ లేదా రష్యా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు రంగంలోకి దిగి, అసలు కుట్ర అమలు కాకముందే ఢాకాలోని అమెరికన్ అధికారిని ‘ఎలిమినేట్’ చేసి ఉండవచ్చని గట్టిగా ప్రచారం జరుగుతోంది. సమ్మిట్ ముగించుకుని భారత్ వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ తీవ్రవాదంపై మాట్లాడుతూ.. “కొన్ని దేశాలు తీవ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. వారే అసలైన తీవ్రవాదులు” అని వ్యాఖ్యానించడం ఈ సంఘటనలకు బలం చేకూరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన తర్వాతే ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీని కూడా రద్దు చేసుకున్నారని గుర్తుచేస్తున్నారు.
అయితే ఈ సంచలనాత్మక కథనాలను భారత్, రష్యా, అమెరికా, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు అధికారికంగా ధృవీకరించలేదు. ఇవి కేవలం వెరిఫైడ్ సోర్సులు లేని జియో-పొలిటికల్ థియరీలు మాత్రమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.