Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన మంచితనం గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పలు సందర్భాలలో బయట పెడుతూ వచ్చారు. ప్రభాస్ ఎలాంటి వివాదాలలోకి వెళ్లకుండా కేవలం తన సినిమా పనులను తాను చూసుకుంటూ మరో ప్రపంచంలో గడుపుతుంటారని చెప్పాలి. ఇక ప్రభాస్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలా మంచి వ్యక్తిత్వం ఉన్న ప్రభాస్ ఒక హీరోని దారుణంగా అవమానించారని తెలుస్తుంది. అసలు ప్రభాస్ మరొక హీరోని అవమానించడం ఏంటి? ఏం జరిగిందనే విషయానికి వస్తే..
ప్రభాస్ హీరోగా ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో ఫౌజీ (Fauzi) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరొక నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) కూడా ఒక పాత్రలో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ రవీంద్రన్ ప్రభాస్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. హను సినిమాలో ప్రభాస్ తో కలిపి తనకు ఒక సీను ఉందని తెలిపారు.
నా పాత్రకు సంబంధించిన షాట్ ఎర్లీ మార్నింగ్ కావడంతో నేను వెళ్లాను. అయితే ప్రభాస్ కూడా తిరిగి అదే షూటింగ్లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ గారిని చూడగానే నేను నమస్తే అని చెప్పడంతో ప్రభాస్ కూడా నమస్తే చెప్పారు. మా ఇద్దరి మధ్య షాట్ కంప్లీట్ అయింది. అయితే నేను ఆ పాత్రకు సంబంధించిన గెటప్ లో ఉండటం వల్ల ప్రభాస్ నన్ను గుర్తుపట్టలేక వెంటనే హను రాఘవపూడి దగ్గరకు వెళ్లి అతను ఎవరు అంటూ అడిగారని రాహుల్ తెలిపారు. వెంటనే హను నన్ను పిలిచి ఈయన నా ఫస్ట్ సినిమా అందాల రాక్షసి హీరో అని చెప్పగానే రాహుల్ రవీంద్రనా అంటూ ఆశ్చర్యపోవడమే కాకుండా నన్ను క్షమించండి మిమ్మల్ని ఈ గెటప్ గుర్తుపట్టలేకపోయాను అంటూ క్షమాపణలు చెప్పారని రాహుల్ రవీంద్రన్ గుర్తు చేసుకున్నారు.
ఫీల్ అవ్వలేదు కదా..నన్ను క్షమించండి
ఇలా ఆరోజు మొత్తం ప్రభాస్ నాకు ఒక పది సార్లు క్షమాపణలు చెప్పారు. మీరేమీ ఫీల్ అవ్వలేదు కదా నిజంగానే నేను గుర్తుపట్టలేకపోయాను.. ఐ యాం సారీ అంటూ కనిపించిన ప్రతిసారి క్షమాపణలు చెబుతూనే ఉన్నారు. పర్లేదు సార్ నేను ఇలాగా ఇంటికి వెళ్లిన మా అమ్మ కూడా నన్ను గుర్తు పట్టదు మీరు అలా క్షమాపణలు చెప్పకండి అని చెప్పినా కూడా ప్రభాస్ గారు ఆరోజు మొత్తం నాకు క్షమాపణలు చెబుతూనే ఉన్నారని ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అంటూ రాహుల్ రవీంద్రన్ ప్రభాస్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే రష్మిక(Rashmika) దీక్షత్ శెట్టి (Deekshith Shetty)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు . ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: Shobha shetty: గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న శోభ శెట్టి.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా!