Director Karuna Kumar : కొన్ని సినిమాల్లో కీలకపాత్రలో కనిపించిన తిరు వీర్ హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తిరు వీర్ హీరోగా చేసిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ మంచి పేరును మాత్రం తీసుకొచ్చాయి. మసుద, పరేషాన్ వంటి సినిమాలకు కొంతమంది పేర్లు లభించింది.
ఇక ప్రస్తుతం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ నేడు అధికారికంగా విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ కు చాలా మంది యంగ్ డైరెక్టర్స్ హాజరయ్యారు. పలాస సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన కరుణకుమార్ కూడా హాజరయ్యారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కరుణ్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ కరుణ్ కుమార్ ఏం మాట్లాడారు?
దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడుతూ… దీనికి రావడానికి కారణం ఏంటంటే తిరు నాకు ఫోన్ చేశాడు. ఎవరెవరు వస్తున్నారు అని అడిగాను. ఎవరెవరు దర్శకులు ఈ సినిమా ప్రమోషన్ కి గెస్ట్ గా వస్తున్నారు పేర్లు చెప్పాడు. ఫస్ట్ సినిమా కష్టాలు ఇక్కడున్న అందరు దర్శకులకి తెలుసు.
ఇక్కడున్నవాళ్ళు ఎవరు కూడా కమర్షియల్ డైరెక్టర్లు కాదు. కారులోంచి హీరో దిగ్గానే భూమి బద్దలైపోయే షాట్స్ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు ఇందులో. ఇక్కడున్న దర్శకులంతా ఫస్ట్ సినిమా ఎర్తీ సినిమా చేశారు. సెకండ్ సినిమా మాత్రం మన చేతిలో ఉండదు. ఫస్ట్ సినిమా అంత మాత్రం మన కల్చర్ ని చూపించేటట్లు చేసిన దర్శకులే ఉన్నారు. రూటేడ్ సినిమాలు చేసిన వాళ్లే ఉన్నారు.
వీళ్ళందరికీ ఒక డైరెక్టర్ కష్టమేంటో తెలుసు. ఈరోజుల్లో ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి.. అప్పటివరకు మనతో సరిగ్గా మాట్లాడిన స్టార్ హీరోను, మంచి నటుడును పిలిస్తే సరిగ్గా ప్రమోషన్ టైంకి “హీరోలు సడన్ గా ఫోన్ ఎత్తకపోవడాలు, వాళ్ళింట్లో ఎవరికో ఒంట్లో బాగోకపోవడాలు” అన్నీ ఉంటాయి.
ఈ వేదిక ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇకమీదట సినిమా ఫంక్షన్లు చేస్తే హీరోల కంటే కూడా ముందు దర్శకులను పిలుచుకోండి. ఎందుకంటే పది మంది దర్శకులను పిలిస్తే కనీసం ఐదుగురు అయిన వస్తారు. ఎందుకంటే డైరెక్టర్లకు ఆ నొప్పి తెలుస్తుంది. అదే యాక్టర్లను పిలిస్తే, సెలబ్రిటీలను పిలిస్తే చివరి నిమిషం వరకు టెన్షన్ పడుతూనే ఉండాలి. మొదటి సినిమా డైరెక్టర్లుగా వీళ్ళందరికీ నొప్పి తెలుసు కాబట్టి వీళ్ళు వస్తారు.
Also Read: Kingdom : కింగ్డమ్ సినిమాలో మురుగన్ క్యారెక్టర్ వదులుకున్న తెలుగు నటుడు