విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. ఒక్కో వ్యక్తి చేసే ప్లాన్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది. అలాంటి వ్యక్తుల ప్లాన్స్ అన్నీ బట్టబయలు చేస్తుంటారు ఎయిర్ పోర్టు అధికారులు. తాజాగా ఓ మహిళ ఏకంగా కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె ఆటలు సాగలేదు. అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది.
అక్టోబర్ 24న మయన్మార్ నుంచి 8M-620 విమానంలో ఓ మహిళ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. టెర్మినల్ -3లోకి అడుగు పెట్టింది. ఎందుకో ఆమె వ్యవహార శైలి కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. సదరు మహిళ తన లోదుస్తులలో దాచిపెట్టిన 1 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఆమె నల్లటి లో దుస్తులలో ఈ బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ బంగారు ఆరు బంగారు బిస్కెట్ల రూపంలో ఉన్నట్లు తెలిపారు. ఈ బంగారు మొత్తం 996.5 గ్రాముల బరువున్నట్లు వెల్లడించారు. ఈ గోల్డ్ విలువ సుమారు రూ. 1.17 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మయన్మార్ నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంగీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను జైలుకు పంపించారు.
Customs, IGI Airport Date: 24.10.2025
Operation: AIU, IGI Airport, New Delhi
Seizure: 996.5 grams Gold Bars
The officers of airport customs preventive, IGI airport, New Delhi have booked a case of smuggling of gold on 24-10-2025, against one foreign national passenger, arrived… pic.twitter.com/HNTr8dwSUV
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) October 25, 2025
ఇక అక్టోబర్ 26న మరో విచిత్రమైన బంగారం అక్రమ రవాణా కేసు బయటపడింది. దుబాయ్ నుంచి AI-996 విమానంలో వచ్చిన ఓ ప్రయాణీకుడు ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. విమాన గేటు నుంచి అతనిని పర్యవేక్షిస్తున్న అధికారులు గ్రీన్ ఛానల్ ఎగ్జిట్ గేట్ దగ్గర అడ్డుకున్నారు. అతడి దగ్గర ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు స్కానింగ్ లో గుర్తించారు. వెంటనే, అతడిని పక్కకు తీసుకెళ్లి, లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి తెలివిని చూసి కస్టమ్స్ అధికారులు షాకయ్యారు. వాటర్ బాటిల్ మూతలో ఏకంగా 170 గ్రాముల బంగారాన్ని ఉంచినట్లు గుర్తించారు. తనిఖీల్లో ఆ బంగారాన్ని బాటిల్ క్యాప్ నుంచి బయటకు తీశారు. ఈ బంగారం విలు సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు. అతడిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేసి, జైలుకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
#DelhiCustomsAtWork@IGI
Date: 25/26.10.2025
Ops: AIU, IGI Airport, New DelhiWhen it comes to smuggling of Gold, the fertile brain of the human race can think in more ways than can be conceived. With the spurt in prices of yellow metal internationally, the inflow is expected to… pic.twitter.com/J5zjWx0FlU
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) October 26, 2025
Read Also: ఢిల్లీ విమానాశ్రయంలో మంటలు, కాలి బూడిదైన ఎయిర్ ఇండియా బస్సు!