Car Gift to Director: ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి సక్సెస్ అందుకొని లాభాలు వచ్చాయి అంటే నిర్మాతలు చిత్ర బృందానికి అలాగే దర్శకులకు ఖరీదైన కానుకలను ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు. ఒకప్పుడు స్టార్ హీరోలు సినిమాలలో కనిపిస్తేనే సినిమాలు హిట్ అయ్యేద కానీ ఇటీవల కాలంలో కథలో సత్తా ఉంటే చిన్న సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇలా ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) సినిమా ఒకటి.
అభిషన్ జీవింత్(Abishan jeevinth) యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకని అనంతరం దర్శకుడిగా టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 75 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. అయితే తాజాగా దర్శకుడు అభిషన్ జీవింత్ ఈనెల 31వ తేదీ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేష్ రాజ్(Magesh Raj) దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత మా దర్శకుడు పెళ్లి కోసం ఖరీదైన బీఎండబ్ల్యూ కారును(BMW car) కానుకగా అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా దర్శకుడు అభిషన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈయనకు పెళ్ళికి కానుకగా నిర్మాత ఇచ్చిన బీఎండబ్ల్యూ కారు సుమారు 50 లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తుంది. ఇలా దర్శకుడి కోసం నిర్మాత ఖరీదైన కారును పెళ్లికి గిఫ్టుగా ఇచ్చిన నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్, శశి కుమార్, యోగి బాబు వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు.
శ్రీలంక నుంచి ఇండియాకు..
ముందుగా ఈ సినిమా తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో తిరిగి తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీలంకలో బతకలేక శశికుమార్ (ధర్మదాస్) భార్యాబిడ్డలను తీసుకొని ఇండియాలోకి అక్రమంగా చొరబడతారు. అయితే వీరు వచ్చిన రోజే రామేశ్వరంలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది అయితే ఈ బాబు బ్లాస్ట్ వెనక శ్రీలంక నుంచి అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన కుటుంబం హస్తం ఉందని అనుమానంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుంటారు. ఈ దర్యాప్తులో భాగంగా ధర్మదాస్ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? చివరికి పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించారా? పోలీసులకు దొరకకుండా ధర్మదాస్ కుటుంబం ఎలా బయటపడింది? ఈయనకు కాలనీవాసులు ఏ విధంగా సహాయపడ్డారనేది ఈ సినిమా కథ.
Also Read: Prabhas : ఆ హీరోను దారుణంగా అవమానించిన ప్రభాస్.. అన్నిసార్లు క్షమాపణలు చెప్పారా.. ఏమైందంటే?