Venkatesh -Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)ఇటీవల కాలంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. ఇకపోతే ఈమె తాజాగా మసూద డైరెక్టర్ తో లేడీ ఓరియంటెడ్ సినిమాకు కమిట్ అయినట్టు వార్తలు వచ్చాయి.
ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఐశ్వర్య కనిపించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించి మరొక వార్త వినపడుతోంది. ఐశ్వర్య రాజేష్ మరోసారి వెంకటేష్ (Venkatesh)సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. వెంకటేష్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటి శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకోవాలనే ఆలోచనలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించారట. అయితే ఈ సినిమాలో ఈమె వెంకటేష్ కు పూర్తిగా వ్యతిరేక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా అంటే ఆ సినిమా పట్ల మంచి అంచనాలే ఉంటాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పూర్తిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
అబ్బాయి గారికి 60 ప్లస్..
ఇక ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో రకాల టైటిల్స్ బయటకు వచ్చాయి. చివరిగా అబ్బాయి గారికి 60 ప్లస్ (Abbayigariki 60 Plus)అనే టైటిల్ ఫైనల్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి కూడా అధికారక ప్రకటన రాబోతోంది. ఇదివరకు వెంకటేష్ నటించిన సినిమాలకు త్రివిక్రమ్ కథ అందించారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ నటించబోతున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా తర్వాత వెంకటేష్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తో ఈయన పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్ సైతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో వెంకీకి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నారనే నేపథ్యంలో ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: Vivek Oberoi: క్యాన్సర్ పిల్లల కోసం రెమ్యూనరేషన్ .. గొప్ప మనసు చాటుకున్న హీరో?