BigTV English

Sreeleela: హీరోయిన్ అన్నారు.. ఐటెంసాంగ్ చేసిందేంటి ?

Sreeleela: హీరోయిన్ అన్నారు.. ఐటెంసాంగ్ చేసిందేంటి ?

Sreeleela: అందాల భామ శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందడD  సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలడానికే పుట్టింది అని అనిపించిది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే అరడజను సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోయిన్లకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. అయితే ధమాకా తర్వాత వరుసగా సినిమాలు చేసిన కూడా అంతటి విజయాన్ని అయితే శ్రీలీల అందుకోలేదని చెప్పాలి.


 

ఇక ఎప్పుడెప్పుడు అంతటి హిట్ ను అందుకుంటుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ అమ్మడు మాత్రం ఒక్క హిట్ అందుకున్నది లేదు.  అయినా కూడా శ్రీలీల వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె నటిస్తున్న చిత్రాల్లో జూనియర్ ఒకటి.  ప్రముఖ రాజకీయ నేత, వ్యాపారవేత్త అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ముద్దుల తనయుడు కిరీటిరెడ్డి జూనియర్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రజనీ కొర్రపాటి నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాతో అందాల భామ జెనీలియా చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.


 

జూలై 18న జూనియర్ రిలీజ్ కు సిద్ధమవుతుంది.  ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి ఒక మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దేవిశ్రీ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వెనుకబడిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యనే కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దేవిశ్రీ ఇప్పుడు మరోసారి జూనియర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 

ఇక సాంగ్ మొత్తం అదిరిపోయింది. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన లిరిక్స్..  సూపర్ మోడర్న్ టచ్ తో యూత్‌తో కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. చరణాలు  సోషల్ మీడియా లాంగ్వేజ్, ట్రెండీ ఫ్రేసెస్ తో హైలైట్  అయ్యాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కిరీటి, శ్రీలీల డ్యాన్స్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. సాధారణంగా శ్రీలీల డ్యాన్స్ ను మ్యాచ్ చేయాలంటే.. స్టార్ హీరోస్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ లాంటివారు కావాలి. కానీ, కిరీటి కూడా ఈ సాంగ్ లో ఆమెకు ధీటుగా స్టెప్స్ వేసి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

 

శ్రీలీల పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ లో అమ్మడి అందాల ఆరబోత  ఏ రేంజ్ లో చేసిందో అందరికీ తెల్సిందే. ఇక ఈ సాంగ్ లో అమ్మడు అంతకు మించిన అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది. ఇక ఈ సాంగ్ చూసిన అభిమానులు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కదా .. ఇలా ఐటెంసాంగ్ చేస్తుందేంటి అబ్బా అంటూ కామెంట్స్ చేసున్నారు. మరి ఈ సినిమాతో కిరీటి, శ్రీలీల ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?

Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Sai Pallavi: నయనతారకు ఎసరు పెడుతున్న సాయి పల్లవి… ఏం చేసిందంటే ?

Pradeep Ranganathan: హీరో నాని రికార్డును సమం చేయబోతున్న యంగ్ హీరో.. ఫలితం లభిస్తుందా?

Roshan Champion: ఫీల్డ్‌లో అడుగుపెట్టిన ఛాంపియన్‌.. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Big Stories

×