BigTV English

Gill Sara Tendulkar : అల్లుడు శీను రేంజ్ లో రెచ్చిపోతున్న గిల్ .. సచిన్ ఇంట్లో రచ్చ రచ్చ !

Gill Sara Tendulkar : అల్లుడు శీను రేంజ్ లో రెచ్చిపోతున్న గిల్  .. సచిన్ ఇంట్లో రచ్చ రచ్చ !

Gill Sara Tendulkar : టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా కెప్టెన్ గా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు గిల్. తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన గిల్.. రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసి రికార్డు  సృష్టించాడు. ముఖ్యంగా శుబ్ మన్ గిల్ ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో 269 పరుగులు చేశాడు. దీంతో గిల్ పై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్  అల్లుడు గిల్.. అల్లుడు శీను రేంజ్ లో రెచ్చిపోతున్నాడని.. ఇక ఇంట్లో రచ్చ రచ్చ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  


Also Read : Lalit Modi – Mallya : ఇండియా బ్యాంకులు దోచేసి.. లండన్ లో ఎంజాయ్ చేస్తున్న నీరవ్, మాల్యా

సారా-గిల్ డ్యాన్స్ అదుర్స్.. 


ముఖ్యంగా అల్లుడు శీను సినిమాలో హీరోయిన్ సమంత, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ డ్యాన్స్ చేసినట్టుగా.. సారా-గిల్ డ్యాన్స్ ని క్రియేట్ చేశారు. అందులో పాటతోనే పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, సారా టెండూల్కర్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నాటు కోడి, రాగి సంకటి ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో హీరో బాలకృష్ణ ను అసలు ఏం చేయలేకపోయావు.. నీకు తిండి దండుగా అని వరలక్ష్మీ శరత్ కుమార్ తన భర్త పోషించిన దునియా విజయ్ తో పేర్కొంటుంది. ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతాప్ రెడ్డి పాత్రలో విలన్ గా నటించారు. ప్రస్తుతం సారా టెండూల్కర్ కూడా శుబ్ మన్ గిల్ కి నీ కోసం రాగి సంకటి, నాటు కోడి, తలకాయ కూర, పొటేల్ కూర తినండి.. సిగ్గుందా నీకు.. అనే డైలాగ్ చెప్పే వీడియోను క్రియేట్ చేశారు.

గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్..

శుబ్ మన్ గిల్- సారా టెండూల్కర్ గత కొద్ది రోజుల నుంచి ఎఫైర్ ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ విడిపోయారని కూడా వార్తలు వినిపించాయి. తాజాగా సారా టెండూల్కర్.. గిల్ కి వివిధ రకాల వంటకాలు పెట్టినట్టు.. వీరసింహారెడ్డి సినిమా డైలాగ్ లతో వీడియోలను ట్రోలింగ్స్ చేయడం విశేషం. తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీలు చేయగా.. రెండో ఇన్నింగ్స్ ఓపెనర్ కే.ఎల్. రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. ఇక రెండో టెస్టులో గిల్ 269 పరుగులు చేయగా.. జైస్వాల్ 87, జడేజా 89 కీలక ఇన్నింగ్స్ ఆడి సెంచరీ మిస్ చేసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ 42, పంత్ 25, కరుణ్ నాయర్ 31, రాహుల్ 02 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకు ఆలౌట్ అయింది. జెమీ స్మిత్ 184 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ 154 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోరు కే వెనుదిరిగారు.

?igsh=bGozaXg1NTI3d2th

Related News

Mohammed Siraj : టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ రిటైర్మెంట్..?

Mohammed Siraj : హైదరాబాద్ లో సిరాజ్ హోటల్… ఒక్కో ఐటమ్ ధర ఎంతంటే.. ఇవి మాత్రం కచ్చితంగా రుచి చూడాల్సిందే

Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..

Asia Cup 2025: దరిద్రంగా మారిన గిల్ ఎంపిక… తుది జట్టులో అభిషేక్ శర్మకు నో ఛాన్స్.. ఫైర్ అవుతున్న అభిమానులు !

IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !

Wankhede Stadium : మునిగిన ముంబై.. వాంఖడే స్టేడియంలోకి భారీగా వరద.. ఈ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×