BigTV English
Advertisement

Sree Leela: నిర్మాతల పాలిట గోల్డెన్ డక్.. నిజమే సుమీ!

Sree Leela: నిర్మాతల పాలిట గోల్డెన్ డక్.. నిజమే సుమీ!

Sree Leela: ఒకప్పుడు ఎన్టీఆర్ (NTR ), ఏఎన్నార్(ANR ), కృష్ణ (Krishna) లాంటి సీనియర్ హీరోలతో పాటూ సావిత్రి (Savitri ) , సూర్యకాంతం(Suryakantam ), అంజలి (Anjali) లాంటి సీనియర్ హీరోయిన్స్ నిర్మాతలకు అనుకూలంగా ఉండేవారు. ముఖ్యంగా తాము ఒక పని చేస్తున్నాము అంటే అది నిర్మాతకు నష్టం రాకుండా.. కష్టం ఎంతైనా భరించేవాళ్లు అనే పేరు కూడా అందుకున్నారు. కానీ జనరేషన్ మారే కొద్దీ పరిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ డిమాండ్ మేరకే ఇప్పుడు నిర్మాతలు ముందడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇలాంటి కాలంలో కూడా నిర్మాతల పాలిట ‘గోల్డెన్ డక్’ లా మారిపోయింది యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela). శ్రీ లీల ఉంటే నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


నిర్మాతల పాలిట బంగారు బాతు..

సాధారణంగా ఒక సినిమా చేస్తున్నారు అంటే.. అందులో మెయిన్ హీరోయిన్ గా ఒకరు.. స్పెషల్ సాంగ్ కోసం మరొక హీరోయిన్ ని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. మెయిన్ హీరోయిన్ కి ఎంత రెమ్యూనరేషన్ అయితే ఇస్తున్నారో.. ఐదు నిమిషాలు ఉండే స్పెషల్ సాంగ్ లో చేసే హీరోయిన్ కి కూడా నిర్మాతలు అంతే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అదనపు భారం ఎక్కువనే చెప్పాలి. కానీ శ్రీ లీలా ఉంటే ఈ సమస్య ఉండదు అని.. ఇప్పటికే ఆమె పలుసార్లు నిరూపించింది కూడా.. శ్రీలీలా ఒక సినిమాలో హీరోయిన్ గా కమిట్ అయింది అంటే.. అందులో స్పెషల్ సాంగ్ కి మరో హీరోయిన్ ని వెతుక్కోవాల్సిన పని లేదు అని చెప్పవచ్చు.


శ్రీ లీలా ఉందంటే.. ఊపిరి పీల్చుకుంటున్న నిర్మాతలు..

ఈమె హీరోయిన్ పాత్రకే కాదు అటు ఐటెం నెంబర్ కి కూడా బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. రొమాంటిక్ సాంగ్ అయినా.. ఊర మాస్ స్టెప్ కైనా ఈమె పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. అందుకే ఈమె సినిమాలో ఉంది అంటే స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లకు నిర్మాతలు కోట్లు వెచ్చించి తెచ్చుకునే ఛాన్స్ లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ. ఇక దీన్ని బట్టి చూస్తే నిర్మాతల పాలిట నిజంగానే బంగారు బాతుగా పేరు సొంతం చేసుకుంది శ్రీలీల.

అటు హీరోయిన్ గా ఇటు స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టేస్తున్న శ్రీ లీల..

ఇప్పటికే ‘ధమాకా’సినిమాలో రవితేజ (Raviteja) సరసన హీరోయిన్ గా నటించినమే కాకుండా అదే సినిమాలో “పల్సర్ బైక్”, “జింతాకా” అంటూ మాసీ స్టెప్పులు వేసి డాన్సింగ్ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ సినిమాలో “కుర్చీ మడతపెట్టి” పాటకు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ఈమె ‘జూనియర్’ సినిమాలో “వైరల్ వయ్యారీ” పాటకి కూడా అదిరిపోయే డాన్స్ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’ సినిమాలో కిసిక్ బ్యూటీగా ర్యాంపేజ్ గ్లామర్ షో తో మాస్ మహారాణిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరొకసారి మాస్ మహారాజా రవితేజ తో కలిసి ‘మాస్ జాతర’ సినిమాతో రచ్చ రంబోలా చేయడానికి సిద్ధం అయ్యింది. ఇలా దీన్ని బట్టి చూస్తే.. నిర్మాతలకు డబుల్ బొనాంజాలా, గోల్డెన్ డక్ లా మారిపోయింది ఈ యంగ్ బ్యూటీ శ్రీ లీల.

Also read: Bollywood: రజనీకాంత్ హీరోయిన్ హుమా ఖురేషి తమ్ముడు హత్య!

Related News

Ajith Kumar: విజయ్‌తో వైరం.. ఎట్టకేలకు నోరువిప్పిన అజిత్‌

Akhanda Thaandavam Promo: అఖండ తాండవం ప్రోమో వచ్చింది… ఇక శివతాండవమే!

Harish Shankar: వార్తలన్నీ అబద్ధాలేనా, త్రివిక్రమ్ తో హరీష్ ఇంత క్లోజ్ గా ఉంటాడా?

Mirnalini Ravi: లగ్జరీ కారు కొన్న వరుణ్‌ తేజ్ హీరోయిన్‌.. ఆ కారు కొన్న తొలి భారతీయ నటిగా ఘనత!

Rashmika -Vijay’s wedding: పెళ్లి పనులలో బిజీగా రష్మిక.. పెళ్లి వేదిక అక్కడే?

Rukmini Vasanth: రుక్మిణి పేరుతో మోసం… అలర్ట్ చేసిన నటి.. చర్యలు తప్పవంటూ!

The Girlfriend Movie : డైరెక్టర్ గారు… వర్క్ షాప్ చేయలేదా ?

Rashmika Mandanna: విజయ్ తో ఆ సినిమా చాలా ప్రత్యేకం..  అసలు విషయం చెప్పిన రష్మిక!

Big Stories

×