OTT Movie : కొన్ని హాలీవుడ్ సినిమాలు విచిత్రమైన కంటెంట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మనుషుల మాంసాన్ని విక్రయించే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కామెడీ, హారర్ జానర్ లో ఆసక్తికరంగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ ఫ్రెంచ్ బ్లాక్ కామెడీ హారర్ మూవీ పేరు ‘Some Like It Rare’. దీనికి ఫాబ్రిస్ ఇబోయె దర్శకత్వం వహించారు. ఇందులో మరీనా ఫోయిస్, జీన్-ఫ్రాంకోయిస్ కైరీ, విక్టర్ మ్యూటెలెట్, లిసా డో కౌటో టెక్సీరా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021లో ఫ్రాన్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ప్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి IMDbలో 6.6/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 87 నిమిషాలు నిడివితో, ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
సోఫీ, విన్సెంట్ అనే దంపతులు ఒక చిన్న పట్టణంలో, ఒక మాంసం దుకాణాన్ని నడుపుతుంటారు. వీళ్ళ వ్యాపారం దివాళా అంచున ఉంటుంది. ఇక సోఫీ తన జీవితంలో ఉత్సాహం కోల్పోయి డల్ గా ఉంటుంది. నిజమైన క్రైమ్ షోలను టీవీలో చూస్తూ రోజులు గడుపుతుంది. అయితే విన్సెంట్ తన కొట్టులోనే సమయం ఎక్కువగా గడుపుతుంటాడు. కానీ ఈ కొట్టు యాక్టివిస్ట్‌ల దాడుల కారణంగా నష్టపోతుంది. ఒక రోజు యాక్టివిస్ట్‌లు వారి షాప్‌ను ధ్వంసం చేస్తారు. ఈ సంఘటనలో విన్సెంట్ ఒక యాక్టివిస్ట్‌ను గాయపరుస్తాడు. ఆ గాయం కారణంగా అతను చనిపోతాడు. అయితే శవాన్ని దాచడానికి, విన్సెంట్ దానిని తన కసాయి నైపుణ్యంతో ముక్కలు చేస్తాడు. సోఫీ అనుకోకుండా ఈ మాంసాన్ని కస్టమర్‌లకు విక్రయిస్తుంది. ఈ మాంసం అద్భుతమైన రుచితో, కస్టమర్‌లను మైమరపిస్తుంది. ఈ క్రమంలో వీళ్ళ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంటుంది.
Read Also : మర్డర్ ఉచ్చులో అడ్డంగా బుక్… పోలీసులతో భార్యాభర్తల దాగుడుమూతలు… ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్