Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో ఉన్న ఆరును ఇక తమ లోకం వెళ్దాం పద అని గుప్త అడుగుతాడు. దీంతో ఆరు నా గడువు ఇంకా ఉంది కదా..? అప్పటి వరకు నేను రాను అంటుంది. దీంతో బాలిక నీ మంచి కోరి చెప్తున్నాను. మా మాటను ఆలకింపుము అంటాడు. ఇంతలో మిస్సమ్మ అక్కా అంటూ పిలుస్తూ లోపలి నుంచి వస్తుంది. మిస్సమ్మను చూసిన ఆరు భాగీ రా అని పిలుస్తుంది. మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంది. ఏంటి భాగీ అలా ఉన్నావు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ కోపంగా ఆ చిత్ర ఏం చేసిందో తెలుసా.? అంటుంది. ఏ చేసింది అని ఆరు అడగ్గానే.. తనుకు ఏ మాత్రం అనుభవం లేకపోయినా..మా ఆయన దగ్గర లక్షలు తీసుకుని వినోద్ తో చీరల వ్యాపారం పెట్టిస్తుంది అని చెప్తుంది.
దీంతో ఆరు కూడా మంచిదే కదా భాగీ ఆ బిజినెస్‌లో వాల్లు డెవలప్ అయితే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడతారు అని చెప్తుంది. దీంతో నాకు అసలు అలా అనిపించడం లేదు అక్కా ఇందాక వాళ్లు పెట్టబోయే శారీ షోరూంకి వెళ్లి వచ్చాం. అక్కడ ఏదో గోల్‌మాల్ జరుగుతున్నట్టు ఉంది అని చెప్తుంది. మరి మీ వారికి చెప్పకూడదా.? అంటుంది ఆరు. ఆయనకు కూడా అదే అనుమానంగా ఉంది అక్క కానీ చిత్ర ఎవరి మాట వినడం లేదు. పాపం అనవసరంగా వినోద్‌ను ఆయన దగ్గర తల దించుకునేలా చేస్తుందేమో..? అంటూ బాధపడుతుంటే.. అలా ఏం జరగదులే భాగీ నువ్వు కంగారు పడకు అని చెప్తుంది. అనుభవం లేని పని చేస్తే వచ్చేది నష్టమే కదా అక్కా.. అప్పటికీ వాళ్లకు ఎక్సీరియెన్స్ కోసం టైం ఇవ్వమని ఆయనతో నేను చెప్పాను. ఆయనేమో డబ్బుల కన్నా రిలేషన్ ముఖ్యం అంటున్నాడు. అనగానే..
అది కూడా నిజమే కదా భాగీ ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలే ముఖ్యం కదా అంటుంది ఆరు. ఆర్థిక సంబంధాలు బాగుంటేనే మానవ సంబంధాలు బాగుంటాయి అక్క.. ఎంత క్లోజ్ రిలేషన్ అయినా డబ్బుల దగ్గరే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ల వ్యాపారంలో లాభాలొస్తే ఓకే కానీ నష్టాలొస్తే.. మోసపోతే.. చిత్ర ఏదోలా తప్పించుకుంటుంది వినోదే బలైపోతాడు. అసలు ఆ చిత్రకు ఎలా నచ్చజెప్పాలో నాకు అర్థం కావడం లేదు అక్క.. అంటుండగానే మనోహరి వస్తుంది. మనోహరిని చూసిన ఆరు చిత్రకు మనోహరితో చెప్పించొచ్చు కదా… వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ కదా అంటుంది. ఇప్పుడు చిత్ర ఎవ్వరినీ లెక్క చేసే పరిస్థితుల్లో లేదు అక్కా అంటుంది. మను కారు దిగి మిస్సమ్మను చూసి ఇది ఆరుతో మాట్లాడుతుందా..? అని భయపడుతుంది. మిస్సమ్మ.. మను చూసి ఏంటి మనోహరి అలా చూస్తున్నావు.. నువ్వు చిత్రకు సర్ది చెప్పాలని అక్క చెప్తుంది. అక్కా మనోహరికి నువ్వైనా చెప్పు అనగానే మనోహరి భయంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో మిస్సమ్మ చీ ఏంటో ఎవ్వరూ నా మాట వినడం లేదు అనుకుంటూ వెళ్లిపోతుంది.
తర్వాత చిత్ర యాడ్ ఏజెన్సీ వాళ్లను ఇంటికి పిలిచి మాట్లాడుతుంది. మాది సిటీలోనే నెంబర్ వన్ యాడ్ ఏజెన్సీ మేడం మేము చేసిన యాడ్స్ వలన ఎన్నో బిజినెస్లు సూపర్ హిట్ అయి లక్షల టర్నోవర్‌తో నడుస్తున్నాయి అని యాడ్ ఏజెన్సీ మేనేజర్ చెప్పగానే.. మా శారీ బిజినెస్ నడవడం కాదు. పరుగెత్తాలి. మా టర్నోవర్ లక్షల్లో కాదు.. కోట్లల్లో ఉండాలి అని చెప్తుంది చిత్ర. ఇంతలో పైనుంచి కిందకు వస్తున్న మిస్సమ్మ చూశావా రాథోడ్ బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడే కోట్ల గురించి కలలు కంటుంది అనగానే.. కలలు కనటం ఫ్రీయే కదా మిస్సమ్మ కననివ్వు.. అంటాడు రాథోడ్. ఓకే మేడం మీ బిజినెస్ టాప్ రేంజ్‌కు వెళ్లాలంటే మీరు ఒక టాప్ హీరోయిణ్ని అయినా టాప్ మోడల్ ను కానీ తీసుకోవాలి. తనతో ఒక యాడ్ ఫిల్మ్ చేయాలి అని చెప్తాడు మేనేజర్. దీంతో చిత్ర అంతా బాగానే ఉంది. కానీ ఎవరో హీరోయిణ్ని తీసుకురావడం ఎందుకు..? నేను ఉన్నాను కదా..? నాకేం తక్కువ ఇప్పుడు వస్తున్న హీరోయిన్ కన్నా నేను బాగానే ఉంటాను కదా..? ఎవరు ఏమనుకున్నా సరే నేను ఈ యాడ్ ఫిల్మ్ లో నటిస్తాను అని చెప్తుంది.
దీంతో మేనేజర్ మేడం అది యాడ్ ఫిల్మ్ అంటే నటించాలి అని చెప్తాడు. నేను నటించగలను అంటుంది చిత్ర. దీంతో మిస్సమ్మ అవును అవును మా చిత్ర భలేగా నటిస్తుంది. డైరెక్టర్ గారు యాక్టింగ్ విషయంలో మా చిత్ర గురించి మీరు కొంచెం కూడా డౌటు పడాల్సిన అవసరం లేదు. మీరు కళ్లు మూసుకుని తనతో యాక్టింగ్ చేయిచోచ్చు అని చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం