Bollywood:సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన ‘కాలా’ సినిమాతో సౌత్ ఆడియన్స్ ను పలకరించింది హుమా ఖురేషీ(Huma Qureshi). ప్రస్తుతం ఈమె సోదరుడు ఆసిఫ్ ఖురేషీ (Asif Qureshi)హత్యకు గురయ్యారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న రాత్రి ఢిల్లీలో ఆసిఫ్ ఇంటి వద్ద పార్కింగ్ విషయంలో యువకులతో వివాదం తలెత్తింది. అది కాస్త తీవ్రం అవడంతో వారు పదునైన ఆయుధాలతో ఆసిఫ్ పై దాడి చేశారు. గాయాల పాలైన ఆసిఫ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆసిఫ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోదరుడి మరణంతో హుమా ఖురేషి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నిన్న ఒక హాలీవుడ్ నటుడు సహాయం చేద్దామని వెళ్లి హత్యకు గురైతే.. ఇప్పుడు తనతో గొడవకు దిగిన వ్యక్తుల చేతుల్లో హీరోయిన్ సోదరుడు హత్యకు గురవడం నిజంగా భయాందోళనకు గురి చేస్తోంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పార్కింగ్ వద్ద అసలు గొడవకు కారణం?
హుమా ఖురేషి కజిన్ బ్రదర్ గా పేరు సొంతం చేసుకున్న ఆసిఫ్ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గురువారం రాత్రి పార్కింగ్ వివాదం కారణంగా హత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాత్రి 11 గంటల సమయంలో జంగ్పురా భోగల్ మార్కెట్ లేన్ లో జరిగింది. అక్కడ ఒక తీవ్రమైన వాగ్వాదం పెరిగి దారుణమైన దాడికి దారితీసింది అని సమాచారం. గేటు దగ్గర ఆపి ఉంచిన స్కూటర్ ను పక్కకు తీయమని అడగడంతో నిందితుడు ఆసిఫ్ పై దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసిఫ్ భార్య, బంధువులతో పాటు సహ కుటుంబ సభ్యులు ఒక్క చిన్న విషయం కారణంగా అతని దారుణంగా చంపారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ హత్యకు సంబంధించి గౌతమ్, ఉజ్వల్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం
హుమా ఖురేషీ కెరియర్..
హుమా ఖురేషీ విషయానికి వస్తే.. ఢిల్లీకి చెందిన ఈమె 1986లో జన్మించింది. ఢిల్లీలో కళాశాల విద్యను పూర్తి చేసిన ఈమె చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంపై ఆసక్తి పెరగడంతో అటు నాటకాలపై కూడా దృష్టి పెట్టింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముంబై వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అలా తొలిసారి 2012లో ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ అనే చిత్రంలో సహాయక పాత్ర చేసింది. ఇందులో చేసింది చిన్న పాత్ర అయినా అతని నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తర్వాత బాలీవుడ్ తో పాటు మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్, తమిళ్ సినిమాలలో నటించింది.
హుమా ఖురేషీ సౌత్ సినిమాలు..
ఈమె తొలిసారి రజనీకాంత్ (Rajinikanth ) హీరోగా నటించిన ‘కాలా’ సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులను పలకరించింది. పా. రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మాణంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత అజిత్ (Ajith) హీరోగా నటించిన ‘వలిమై’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా రూ. 234 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టిం
ALSO READ:Radhika Apte: ప్రెగ్నెన్సీలో కూడా వదలని నిర్మాత.. నీచుడు అంటూ రాధిక ఎమోషనల్!