E-Paper
Advertisement

Roshan – Sridevi: లవ్ పై స్పందించిన రోషన్ – శ్రీదేవి.. కోర్ట్ కంటే ముందే అంటూ!

Roshan – Sridevi: లవ్ పై స్పందించిన రోషన్ – శ్రీదేవి.. కోర్ట్ కంటే ముందే అంటూ!
Advertisement

Roshan – Sridevi: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక జంట వరుసగా రెండు మూడు సినిమాలు చేసినా.. లేదా ఒక సినిమా తర్వాత ఎక్కువగా పబ్లిక్ లో కనిపించినా సరే వారి మధ్య ఏదో నడుస్తోంది అనే వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తాయి. అయితే కొన్ని జంటలు వాటిపై స్పందిస్తే మరికొన్ని జంటలు చూసి చూడనట్టు వదిలేస్తాయి. కానీ నిప్పు లేనిదే పొగ రాదు అని ఎన్నో జంటలు నిరూపించాయి కూడా.. మొదట్లో మీడియాలో వచ్చిన వార్తలను కొంతమంది కొట్టి పారేసినా.. ఆ తర్వాత కాలక్రమేనా రిలేషన్షిప్ లోకి వెళ్లడం , పెళ్లి చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సోషల్ మీడియా రూమర్స్ నిజమే..

ఇక సోషల్ మీడియాలో అంత లేనిదే వార్తలు రావు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే గత ఎనిమిది సంవత్సరాలుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎక్కడా అధికారికంగా ప్రకటన చేయకుండా తమ రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా వీరి బంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా స్పందించలేదు.. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి సోషల్ మీడియా రూమర్స్ ను నిజం చేశారు.

లవ్ పై స్పందించిన శ్రీదేవి, రోషన్..

Advertisement

ఇకపోతే ఇప్పుడు తాజాగా కోర్ట్ సినిమాతో సంచలనం సృష్టించి.. మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జంట శ్రీదేవి, రోషన్. వీరు నటిస్తున్న మరో మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ జంట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవ్వగా.. ఊహించని సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

ALSO READ:Manasa Varanasi: పెళ్లికి ముందు అలా చేయడం తప్పేం కాదు.. మానస వారణాసి బోల్డ్ కామెంట్స్

కోర్ట్ మూవీ కంటే ముందే పరిచయం..

Advertisement

ఇంటర్వ్యూలో భాగంగా ఆన్ స్క్రీన్ లో ప్రేమ పాటలు పాడుకుంటున్న ఈ జంట.. ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రేమలో ఉందనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది. దానికి మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించారు. అందుకు రోషన్, శ్రీదేవి స్పందిస్తూ..” కోర్టు మూవీ కంటే ముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరం కూడా చైల్డ్ ఆర్టిస్టులమే . అయితే మేమిద్దరం ఎలా పరిచయమయ్యామో మాకు గుర్తులేదు. కానీ మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఒరేయ్, పోరా అనుకునే అంత క్లోజ్ నెస్ మా మధ్య ఉంది. ఇక కోర్ట్ సినిమా తర్వాత మా మధ్య రిలేషన్ మరింత క్లోజ్ గా మారింది. తెరపై మమ్మల్ని చూసినవారు రియల్ లైఫ్ లో మేము ప్రేమికులు అనుకుంటున్నారు. ఆ కామెంట్స్ చూసి నవ్వుకొని వదిలేస్తున్నాము. నిజానికి మా మధ్య ఏం లేదు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బ్యాండ్ మేళం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. 10 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×