E-Paper
Advertisement

Tanveer Ahmed: రాసిపెట్టుకోండి.. ఫైన‌ల్స్ లో 35 బంతుల్లో ఫిన్ అలెన్ సెంచ‌రీ చేస్తాడు

Tanveer Ahmed: రాసిపెట్టుకోండి.. ఫైన‌ల్స్ లో 35 బంతుల్లో ఫిన్ అలెన్ సెంచ‌రీ చేస్తాడు

Tanveer Ahmed:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  ఫైనల్ మ్యాచ్ మరికొన్ని క్షణాల్లోనే ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా అలాగే న్యూజిలాండ్ జట్లు ( Team India vs New Zealand, Final ) తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా   ( Narendra Modi Stadium, Ahmedabad )  ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ ( Jio Hotstar) అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ( Star Sports) ఈ మ్యాచ్ తిలకించవచ్చు. ఇలాంటి నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని బాంబు పేలిచారు. ఈ మ్యాచ్ లో 35 బంతుల్లోనే న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ( Finn Allen ) సెంచరీ నమోదు చేస్తాడని సంచలన ప్రకటన చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

ఫైన‌ల్స్ లో 35 బంతుల్లో ఫిన్ అలెన్ సెంచ‌రీ చేస్తాడు

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయేందుకు పాకిస్తాన్ లో పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ అల్లా న్యూజిలాండ్ ను కచ్చితంగా గెలిపిస్తాడని సంచలన ప్రకటన చేశారు. తాను కూడా ఇండియా ఓడిపోయేలా పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని టీమిండియా గెలిచే ఛాన్సులు ఉంటాయని.. అవకాశం ఇవ్వకుండా న్యూజిలాండ్ రెచ్చిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండియాను తక్కువ అంచనా వేయకుండా న్యూజిలాండ్ బాగా ఆడాలని కోరారు. ఇక మొన్న దక్షిణాఫ్రికాపై సెంచరీ నమోదు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్, ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని పేర్కొన్నాడు. 35 బంతుల్లోనే 100 పరుగులు చేయడం గ్యారంటీ అంటూ ప్రకటించారు తన్వీర్ అహ్మద్. అతని దెబ్బకు టీమిండియా చిత్తుచిత్తుగా ఓడుతుందని అంచనా వేశారు. ఒకవేళ t20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో ( T20 World Cup 2026 tournament )  టీం ఇండియా విజయం సాధిస్తే మాత్రం.. తాను బట్టలు లేకుండా ఆ పాకిస్తాన్ లో తిరుగుతానని తన్వీర్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ నేపథ్యంలో ఇండియాకు కొత్త టెన్షన్ మొదలైంది. ఐసీసీ t20 ప్రపంచ కప్ లలో ఇప్పటి వరకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ లు జరిగాయి. అన్ని మ్యాచ్లలో టీమిండియా ఓడిపోవడం గమనార్హం. అడు మోడీ స్టేడియంలో ఇండియా గెలవడం కష్టమే అని మరికొంతమంది అంటున్నారు.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

?utm_source=ig_web_copy_link

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×