E-Paper
Advertisement

మహేష్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

మహేష్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

Srinivasa Mangapuram: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడంటే అభిమానుల్లో అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీనివాస మంగాపురం రిలీజ్‌కు ముందు కూడా ఇదే హంగామా కనిపించింది. సోషల్ మీడియాలో పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో భారీ హైప్ క్రియేట్ అయింది కూడా. ఇక RX 100 దర్శకుడు తీసిన అజయ్ భూపతి పేరు కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచింది. దీంతో తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తాయని చాలామంది భావించారు. కానీ థియేటర్ల నుంచి బయటకు వచ్చిన రిజల్ట్ మాత్రం పెద్ద షాకే ఇచ్చింది.

సినిమా రిలీజ్ అయిన మొదటి  కేవలం రూ.1.65 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసిందనే రిపోర్టులు భయటికి బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా డిబేట్లు మొదలయ్యాయి. “మరీ ఇంత తక్కువా?”, “ఘట్టమనేని హీరోకి ఇవేనా ఓపెనింగ్స్?” అంటూ  వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు . కొందరైతే “ప్రీ రిలీజ్ హైప్ అంతా ఎక్కడికి పోయింది?” అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు  కూడా. అసలు భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాకి  ఇలాంటి ఓపెనింగ్ ఏంటీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అంతా.

Advertisement

కేవలం కోటి రూపాయల ఓపినింగ్ రావడం ఏంటి?

ఇదిలా ఉంటే ఇంకోవైపు మరో చర్చ కూడా గట్టిగానే నడుస్తోంది. కేవలం కోటి రూపాయల ఓపినింగ్ రావడం ఏంటి? “మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయలేదా?” ఏంటి అంటూ ఒకప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి హీరో వస్తే మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తారని చాలామంది అనుకున్నారు. కానీ తొలి రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత “ఫ్యాన్స్ ఎక్కడ?” అన్న ప్రశ్నే చాలా మంది నుండి వినిపించింది.

Advertisement

సోషల్ మీడియాలో  పోస్టులు పెట్టడం మానేసి ముందు థియేటర్లకు వెళ్లి టికెట్ కొంటే బాగుండు అంటూ సెటైర్స్ వదులుతున్నారు యాంటి ఫ్యాన్స్.మరికొందరు అయితే  “మహేష్ బాబు సినిమా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం క్యూలు కనిపిస్తాయి… కానీ ఇప్పుడు ఆ హడావిడి ఎందుకు కనిపించలేదు?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

అభిమానుల మీదకి నెట్టడం సరైంది కాదు

అయితే మరో వర్గం మాత్రం ఈ కామెంట్లను పూర్తిగా ఖండిస్తోంది. “ఒక సినిమా విజయం లేదా ఓపెనింగ్స్‌ను కేవలం అభిమానుల మీదకి నెట్టడం సరైంది కాదు.ఎవరెన్ని చేసినా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకెళ్లేది సినిమా కంటెంట్ మాత్రమే”అంటూ కౌంటర్ వేస్తున్నారు. మంచి టాక్ వస్తే ఫ్యాన్స్ మాత్రమే కాదు,సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారన్నది వారి వాదన.

అయితే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌తోనే సినిమా ఫైనల్ రిజల్ట్ చెప్పడం తొందరపాటు అవుతుందన్నది ఎక్కువ మంది నుండి వినిపిస్తున్న మాట.అయితే సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ  జయకృష్ణ విషయానికి వస్తే, డెబ్యూ హీరోగా తనవంతు ప్రయత్నం చేశాడనే అభిప్రాయం చాలా మంది నుండి వినిపిస్తుంది.

కొన్ని సీన్స్ లో జయకృష్ణ  బాగానే కనిపించినా, నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఇంకా మెరుగుపడాల్సి ఉందని ప్రేక్షకులు చెబుతున్న మాట. హీరోయిన్ రషా తడాని తన అందం, నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. అయితే సినిమా మొత్తానికి మిక్స్‌డ్ టాక్ రావడం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపిందనేది  ట్రేడ్ వర్గాల విశ్లేషణ.

గౌతం ఎంట్రీ కి కూడా మహేష్ ఇలాగే వీడియో వదులుతాడా ?

ప్రస్తుతం అందరి చూపు వీకెండ్‌పైనే. తొలి రోజు షాక్ నుంచి సినిమా బయటపడుతుందా? మౌత్ పబ్లిసిటీతో కలెక్షన్స్ పెరుగుతాయా? లేక ఇదే జోరు కొనసాగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం సెటైర్లు, మీమ్స్, అభిమానుల మధ్య  వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… స్టార్ ఇంటి నుంచి హీరో రావడం ఒక్కటే సరిపోదు. ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే చివరికి సినిమా వాళ్లను మెప్పించాల్సిందే..ఏది ఏమైనా  గౌతం ఎంట్రీ కి కూడా మహేష్  గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ ఏర్పాటు చేయకుండా ఇలాగే సింపుల్ వీడియో వదిలేసి ఊరుకుంటాడా ..ఏమో ఎవరికీ తెలుసు !

also read :‘పారడైస్’కి మళ్లీ బడ్జెట్ షాక్?.. నాని ఫుల్ టెన్షన్‌లో ఉన్నాడా?

 

Related News

‘పారడైస్’కి మళ్లీ బడ్జెట్ షాక్?.. నాని ఫుల్ టెన్షన్‌లో ఉన్నాడా?

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

రష్మికకు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

శోభిత ధూళిపాళ ర్యాంప్ వాక్.. చూపు తిప్పుకోలేకపోతున్న నెటిజన్లు!

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆరంభం!

‘ఏంటో ఏమో’తో ఆకట్టుకున్న ‘కాళాంకి భైరవుడు’..విజయవాడలో గ్రాండ్ ఈవెంట్!.

‘ఇదే రామయుగం ఆరంభం’.. సందీప్ వంగా ట్వీట్ వైరల్

Big Stories

Advertisement
×