E-Paper
Advertisement

శ్రీనివాస మంగాపురం నుంచి ‘అలేల్లే .. అలేల్లే’ ఫస్ట్ సింగిల్ రిలీజ్!

శ్రీనివాస మంగాపురం నుంచి ‘అలేల్లే .. అలేల్లే’ ఫస్ట్ సింగిల్ రిలీజ్!
Advertisement

Srinivasa Mangapuram: ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచిగా సక్సెస్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi)తాజాగా ఘట్టమనేని వారసుడిని  ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ శ్రీనివాస మంగాపురం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపద్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా టీజర్ వీడియోకి చాలా మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.

రాయిలో హాయికి.. రేయిలో రంగుకి ప్రాణమే నీ ప్రేమలే..

‘అలేల్లే … అలేల్లే’అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోకి మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా  ‘అలేల్లే …అలేల్లే’ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీమణి సాహిత్యంలో వచ్చిన ఈ పాటను జీవీ ప్రకాష్, హరిప్రియ ఆలపించారు. ఇక ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ను డైరెక్టర్ అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రాయిలో హాయికి.. రేయిలో రంగుకి ప్రాణమే నీ ప్రేమలే అంటూ ఈ పాటకు సంబంధించిన అప్డేట్ షేర్ చేశారు.

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ..

Advertisement

ఇలా లవ్ రొమాంటిక్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారా ఈ ఘట్టమనేని వారసుడు జయకృష్ణ(Jayakrishna) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా దివంగత నటుడు రమేష్ బాబు అందరికీ ఎంతో సుపరిచితమే. రమేష్ బాబు వారసుడిగా జయకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాలో జయకృష్ణ జోడిగా రాషా తడాని(Rasha Tadani) నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి రవీనా టాండన్ వారసురాలిగా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు.

Advertisement

శ్రీనివాస మంగాపురం సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో లవ్ రొమాంటిక్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ హీరో తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)సైతం ఈ సినిమాలో విలన్ పాత్రలోను అలాగే హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా జయకృష్ణ నటనపై ప్రశంసలు కూడా వచ్చాయి. తాజాగా  ‘అలేల్లే.. అలేల్లే’ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: డూప్ లేకుంటే హీరోలు సెట్ లోకి రారు.. టాలీవుడ్ హీరోల భాగోతం బయటపెట్టిన రవి బాబు!

Related News

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

అమితాబ్ కి సర్జరీ.. ఎంత పెద్ద తోపైనా ఓటమి తప్పదంటూ పోస్ట్!

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

Big Stories

Advertisement
×