E-Paper
Advertisement

జయకృష్ణ ఎంట్రీకి ఫుల్ జోష్.. ‘ఉక్కిరి బిక్కిరి’ సాంగ్ వైరల్!

జయకృష్ణ ఎంట్రీకి ఫుల్ జోష్.. ‘ఉక్కిరి బిక్కిరి’ సాంగ్ వైరల్!
Advertisement

Srinivasa Mangapuram: ఘట్టమనేని కుటుంబం నుండి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమైపోయింది.అవును …మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా  ‘శ్రీనివాస మంగాపురం’అంటూ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాడు.ఈ సినిమాని RX100ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా వైజయింతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తుండటం విశేషం.

ఇక పోస్ట్ ప్రొడక్షన్ స్పీడప్ చేసుకున్న  ఈ సినిమా జూలై 30న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది.అందులో భాగంగానే తాజాగా ‘ఉక్కిరి బిక్కిరి’ అంటూ మరో క్రేజీ సాంగ్ ని రిలీజ్ చేసింది.ఇక ఈ పాట అలా వచ్చిందో లేదో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేసింది.ముఖ్యంగా ఈజీగా క్యాచ్ అయ్యే ట్యూన్,అదిరిపోయే విజువల్స్, జయకృష్ణ ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ అన్నిటికన్నా మించి రవీనా టాండన్ కూతురు బాలీవుడ్ బ్యూటీ రషా థడానితో జయకృష్ణ పంచిన కెమిస్ట్రీ యూత్ కి బాగా ఎక్కేసిందన్నటాక్ వినిపిస్తుంది.

Advertisement

 పవర్‌ఫుల్ రోల్ లో కలెక్షన్ కింగ్

ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి.ఆయన ఈ సినిమాలో ఒక  పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్నాడని వదిలిన అప్ డేట్స్ ని బట్టి అర్థం అవుతుంది.ఇక మోహన్ బాబుతో పాటు బ్రహ్మాజీ, నరేష్ వంటి వారు కీ రోల్స్ పోషిస్తుండటం సినిమాని మరో మెట్టు ఎక్కించేవే !మరో వైపు దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని లవ్, యాక్షన్,ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఒక  మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారని  ఇన్ సైడ్ వినిపిస్తున్న టాక్.

Advertisement

also read :“అసలు వీళ్లని ఎవరు కంటున్నారో.. ?” యువతపై ఫైర్ అయిన బాలీవుడ్ క్వీన్!

కథ విషయానికి వస్తే

ఇక సినిమా కథ విషయానికి వస్తే శ్రీనివాస మంగాపురం సినిమా కథ విషయానికి వస్తే..తిరుపతికి చెందిన శ్రీనివాస బాబు అలియాస్ వాసు బాబు(జయకృష్ణ ఘట్టమనేని)  మంగ తాయారు  (రషా తడానీ) ఇద్దరు ప్రేమలో పడతారు.అయితే వారి ప్రేమకు బళ్లారిలో మైనింగ్ డాన్ వెంకటప్పయ్య నాయుడుఅడ్డు పడుతాడు. వాసు బాబును మంగ నుంచి వేరు చేయడానికి తన అనుచరులను పంపిస్తాడు. వాసు, మంగ ప్రేమాయణం, రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? వెంకటప్పయ్య నాయుడు ఎందుకు వారి ప్రేమకు అడ్డు తగిలాడు? తిరుపతిలో శక్తిమంతుడైన వెంకటప్పయ్యను వాసుబాబు ఎలా ఎదురించాడు? మంగతో ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నదే సినిమా కథని తెలుస్తుంది.

జూలై 30న రిలీజ్

చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై వైజయంతీ మూవీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ జెమిని కిరణ్, సి. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం విశేషం.చూడాలి మరి జూలై 30న రిలీజ్ కానున్న  ఈ సినిమా ఘట్టమనేని వారసుడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో !

Related News

“అసలు వీళ్లని ఎవరు కంటున్నారో.. ?” యువతపై ఫైర్ అయిన బాలీవుడ్ క్వీన్!

అదే నాకు భారతరత్న.. అవార్డులపై స్పందించిన సీనియర్ హీరో సుమన్!

రామ్ చరణ్‌కి సర్జరీ సక్సెస్.. కోయంబత్తూర్ హాస్పిటల్‌లో రిస్కీ ఆపరేషన్!

ఆగస్టు 9న ‘దూకుడు’ రీ-రిలీజ్.. మళ్లీ బాక్సాఫీస్ షేక్ అవుతుందా?

5 కోట్ల మూవీకి 26 కోట్లు ఖర్చు.. మహేంద్రగిరి వారాహి మూవీ బడ్జెట్ పై నిర్మాత రియాక్షన్?

ఒడిశా అమ్మాయి సంచలనం.. ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌గా జ్యోతిర్మయి నాయక్!

హీరోయిన్స్ కి డ్రీమ్ రోల్ పడాలంటే వారి వల్లే సాధ్యం.. మాళవిక బోల్డ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×