E-Paper
Advertisement

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !
Advertisement

Anand Deverakonda Vaishnavi Chaitanya:ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆనంద్‌ దేవరకొండ పలు ఆసక్తి కరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో వైష్ణవి చైతన్యతో తనకి లవ్ ఉందన్న వార్తలకి ఎండ్ కార్డ్ వేస్తూ మనసులోని విషయాన్ని బయటపెట్టాడు.

Advertisement

వైష్ణవి ఇంకా చాలా చిన్న పిల్ల

ఆనంద్ తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ.. వైష్ణవితో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేశాడు. అసలు ఈ రూమర్స్ ఎలా పుట్టాయో తెలీదని , తామిద్దరం కేవలం మంచి స్నేహితులమని చెప్పాడు. “వైష్ణవి ఇంకా చాలా చిన్న పిల్ల.. ఆమె వయసు 24 ఏళ్లే. తన కెరీర్ ఇప్పుడే మొదలైంది, సాధించాల్సింది చాలా ఉంది. తనకు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని
తెలిపాడు.

Advertisement

పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు

అంతేకాకుండా, తన ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ఉందనే విషయాన్ని ఒప్పుకున్న ఆనంద్.. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ రూమర్లతో తనను, వైష్ణవిని పోలుస్తూ సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, వార్తలను అసలు తాను పట్టించుకోనని చెప్పాడు. సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉంటానని, దాని వల్ల నెగెటివిటికి దూరంగా ఉండొచ్చని చెప్పుకొచ్చాడు.

తన అన్నయ్య విజయ్ రష్మికతో రెండు సినిమాలు చేయడం , ఆతర్వాత వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం,ఇపుడు నేను, వైష్ణవీ వరుసగా రెండు సినిమాలు చేయడం వల్ల ఇలా పోలికలు తెస్తారని అభిప్రాయపడ్డాడు

ముందుగా గుర్తొచ్చేది ‘బేబీ’ సినిమా

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కాంబినేషన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘బేబీ’ సినిమా. ఆ సినిమాలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగా వర్కవుట్ అయిందంటే.. ప్రేక్షకులు సినిమాను హిట్ చేయడమే కాకుండా, రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ సృష్టించడం మొదలుపెట్టారు.

ALSO READ:సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ఎపిక్’ ట్రైలర్, ప్రమోషన్స్ చూసిన నెటిజన్లు మళ్లీ వీళ్ల రిలేషన్‌షిప్ గురించి రూమర్స్ తెగ సర్క్యులేట్ చేశారు. కానీ ఆనంద్ ఇచ్చిన ఈ క్లారిటీ ఆ వార్తలన్నింటికీ పుల్‌స్టాప్ పడిందనే చెప్పాలి

Tags

Related News

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×