Hanuman Ansh 2:క్యాస్టింగ్ కాదు కావాల్సింది కంటెంట్ అంటూ చిన్న బడ్జెట్ తో వచ్చి బాక్సాఫీస్ ని ఊచకోత కోసిన సినిమా ‘హనుమాన్ అంష్’.ఈ సినిమాని నీమ్ కరోలి బాబా జీవిత విశేషాల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెల్సిందే. మొదట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 150 కోట్లకి పైగా కొల్లగొట్టడం విశేషం.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ నటించబోతున్నారన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.అయితే ఈ రూమర్స్ కి కారణం ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నమ్రతా చేసిన కామెంట్స్ .
మీడియా రిపోర్టర్స్ ఈ సినిమా సీక్వెల్ లో విరాట్, అనుష్కలు నటించే అవకాశం ఏమైనా ఉందా అన్న ప్రశ్నకి జవాబిస్తూ తాము ఇప్పటికే పలువురు సెలెబ్రిటీ లని అడిగామని తెలిపారు,పైగా వారికి ఈ సినిమా గురించి ముందే తెలుసని వెల్లడించింది.దీంతో రాబోయే సీక్వెల్ లో విరాట్, అనుష్కలు నటించబోతున్నారు అంటూ ఊదరగొట్టేస్తున్నారు నెటిజన్లు.
నిజానికి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ,అనుష్క శర్మ దంపతులు నీమ్ కరోలి బాబాని దర్శించుకుంటారన్న సంగతి తెల్సిందే.ఇక అడపాదడపా వీరు ఉత్తరాఖండ్‌లోని కైన్చీ ధామ్‌ను సందర్శించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి కూడా.
దీంతో రాబోయే సీక్వెల్ లో ఖచ్చితంగా వారికి సంబందించిన విషయాలు , నీమ్ కరోలి బాబాతో వారికున్న అనుబంధం రాబోయే సీక్వెల్ లో ఉంటాయని బలంగా ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్.ఇది నిజమా,లేక రూమర్సా అన్న విషయం పక్కన పెడితే వీళ్ళు గనుక నిజంగా సినిమాలో నటిస్తే మాత్రం సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోవడం ఖాయం.
ఇక సినిమాకి ప్రధాన అంశంగా మారిన నీమ్ కరోలి బాబా విషయానికి వస్తే..ఈ బాబా అసలు పేరు లక్షణ నారాయణ శర్మ.ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఈయన హనుమంతుడికి పెద్ద భక్తుడు.ఒక సందర్భంలో ఆయన రైలు జర్నీ చేస్తుండగా టికెట్ లేదని దించేశారట.అయితే ఎదో మాయ జరిగినట్టు అదే సమయంలో రైలు ఆగిపోయిందట,మళ్ళీ ఆయన రైలు ఎక్కితేనే అది స్టార్ట్ అయిందట.
ఇలాంటి వింతలు ఎన్నో ఆయన ద్వారా జరిగాయని వినిపిస్తుంటుంది.ఇక ఆయన ఊరు పేరు నీమ్ కరోలి పేరుతోనే నీమ్ కరోలి బాబాగా ప్రసిద్ది చెందారు. ఆయన సిద్దాంతం
“అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి” .ఆ మాటతోనే ఆయన ఎంతో మందికి దగ్గరయయారు.
ఇదిలా ఉంటె సూపర్ హిట్ అయిన ఈ సినిమాని ముందుగానే ముచ్చటగా మూడుభాగాలుగా తీయాలని నిర్ణయించడం విశేషం. రెండో భాగంలో ప్రధానంగా కైన్చీ ధామ్ విశేషాలు, నీమ్ కరోలి బాబా ప్రభావంతో జీవితాలను మార్చుకున్న భారతీయ భక్తుల అనుభవాలను తెరకెక్కిస్తుండగా, మూడో భాగం లో ఆపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మెటా సీయీవో మార్క్ జుకర్ బర్గ్, ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీ, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ వంటి ఇంటర్నేషనల్ సెలెబ్రిటీలపై బాబా ఎలాంటి ప్రభావాన్ని చూపించించారో తెరకెక్కించ నున్నారని తెలుస్తుంది.
ALSO READ:ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!
చూడాలి తొలిభాగంతో వందకోట్ల పైబడి కలెక్షన్స్ కొల్లగొట్టిన హనుమాన్ అంశ్ మిగతా రెండు భాగాలతో ఎన్ని వసూల్లని వెనకేస్తుందో !