E-Paper
Advertisement

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!
Advertisement

Pragya Jaiswal:ప్రగ్యా జైస్వాల్ …కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత జోరు తగ్గించింది.అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది.ఇక అప్పుడప్పుడు ట్రావెల్, ఫ్యాషన్ ఫొటోలతో అభిమానులను పలకరించే ఈ ముద్దుగుమ్మ తాజాగా గ్రీక్‌లోని అందమైన మైకోనోస్‌కు వెళ్లింది. అక్కడ సముద్రం ఒడ్డున దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. “Hello Mykonos” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో.. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

నీలిరంగులో సముద్రం, వెనక కొండలు, పడవలు.. మధ్యలో ప్రగ్యా ఫ్లోరల్ డ్రెస్‌లో ఇచ్చిన పోజు అదిరిపోయిందనే చెప్పాలి. కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకుని, చిరునవ్వుతో కనిపించిన ఆమె లుక్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ప్రగ్యా ఇచ్చిన పోజ్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

Advertisement

మైకోనోస్ విషయానికి వస్తే ఇది గ్రీక్‌లో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. బీచ్‌లు, సముద్రం, బ్యూటిఫుల్ స్ట్రీట్స్,వైట్ కలర్ బిల్డింగ్స్, సన్‌సెట్‌లతో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉందనే చెప్పాలి. ఇక సెలబ్రిటీలు కూడా వెకేషన్ కోసం ఈ ప్లేస్‌ను తెగ ఇష్టపడుతుంటారనడం లో సందేహం లేదు. అలాంటి ప్లేస్‌కు ప్రగ్యా వెళ్లడంతో ఇపుడు ఆమె ఫ్యాన్స్ కూడా ఈ ట్రిప్‌పై ఆసక్తి చూపిస్తున్నారట.

ఇక ఈ ఫొటోలో మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రగ్యా ఎలాంటి హడావుడి లేకుండా చాలా నేచురల్‌గా కనిపించడమే .సాధారణంగా హీరోయిన్లు ఫొటోలు పెట్టేటప్పుడు ఫ్యాషన్, గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారన్న సంగతి తెల్సిందే. కానీ ప్రగ్యా ఈ ఫొటోలో మాత్రం బ్యాక్ గ్రౌండ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం విశేషం.అందుకే ఫొటో చూసిన నెటిజన్లు కూడా లైక్ చేస్తున్నారు.

Advertisement

ప్రగ్యా జైస్వాల్‌ విషయానికి వస్తే ఈ భామకి టాలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ బాలకృష్ణతో చేసిన ‘అఖండ’ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మరో సినిమా ఆ స్థాయిలో హిట్ కాకపోవడం గమనార్హం. అయితేనేం సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ సంపాదించింది.

ఇక ప్రగ్యా ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్స్, ట్రావెల్ మూమెంట్స్, ఫిట్‌నెస్ అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పుడు మైకోనోస్ ఫొటో కూడా అదే రేంజ్‌లో వైరల్ అవుతోంది. “మైకోనోస్ వెళ్లావా.. సూపర్”, “వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావ్”, “లొకేషన్ కంటే నువ్వే బాగున్నావ్” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు వదలడం ఇక్కడ విశేషం.

మరి ప్రగ్యా ఈ ట్రిప్‌కు ఎందుకు వెళ్లిందన్నది మాత్రం క్లారిటీ లేదు. షూటింగ్ కోసం వెళ్లిందా? లేక పూర్తిగా పర్సనల్ వెకేషన్‌నా? అన్న విషయం తను చెబితేకాని బయటపడాలి.

Tags

Related News

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×