Samantha: సినీ నటి సమంత నాగచైతన్య విడాకులు ఇచ్చిన అనంతరం తిరిగి ఈమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన మూడు సంవత్సరాలు పాటు ఒంటరిగానే గడిపిన సమంత గత ఏడాది డిసెంబర్ నెలలో దర్శకుడు రాజ్ తో కలిసి మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పాలి. ఇక పెళ్లి తర్వాత సమంత తిరిగి కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. తాజాగా సమంత ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమె తల్లి కాబోతున్న నేపథ్యంలో చిన్న బ్రేక్ తీసుకున్నారు .ఇదిలా ఉండగా తాజాగా సమంత ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రాజ్ తో పెళ్లి గురించి అలాగే పెళ్లి సమయంలో సమంత వేలికి రాజ్ తొడిగిన రింగు(Ring) గురించి పలు కీలక విషయాలను తెలియచేశారు.
సమంత పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సమయంలో ఆమె వేలికి ఉన్న రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ రింగ్ గురించి సమంత తాజాగా స్పందిస్తూ…రాజ్ నాకు ప్రపోజ్ చేసిన సమయంలో ఆ రింగ్ తన చేతికి దొరికారని తెలిపారు. అయితే ఈ రింగ్ కు సంబంధించిన ఎలాంటి విషయాలు తనకు తెలియవని ఏ విషయమైనా రాజ్ ను అడగాల్సిందే అంటూ సమంత తెలిపారు. అయితే ఈ రింగ్ మాత్రం గ్రీస్ కు చెందిన ఒక జ్యువెలరీ డిజైనర్ రూపొందించారనే విషయం మాత్రం తనకు తెలుసని తెలిపారు. ఈ రింగ్ ఏథెన్స్ కు చెందిన థియోడోరస్, సవోఫౌలస్ రూపొందించారు. ఈ రింగుకు సంబంధించిన ఫోటోని ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ రాజ్ సమంత దంపతులకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇలా రాజ్ ప్రత్యేకంగా సమంత కోసం ఈ రింగ్ డిజైన్ చేయించారని తెలుస్తోంది. అయితే పెళ్లిలో కాకుండా సమంతకు ప్రపోజ్ చేసే సమయంలోనే ఈ ఇచ్చినట్టు సమంత తెలిపారు. ఇక ఈ రింగ్ గురించి సమంత ఇలాంటి కామెంట్స్ చేయడంతో దీని విలువ ఎంత ఉంటుంది అనే చర్చ కూడా మొదలైంది. లోజెంజ్ కట్ డైమండ్ రూపొందిన ఈ రింగ్ సుమారు 1.5 కోట్ల విలువ చేస్తుందని తెలుస్తుంది .ఇక ఈ రింగ్ రూపొందించే సమయంలో ఇందులో ఎనిమిది పోర్ట్రెయిట్ కట్ వజ్రాలు పూల రేకుల మాదిరిగా అమర్చినట్లు తెలుస్తోంది. అయితే పోర్ట్రెయిట్ కట్ వజ్రాలకు మన భారతీయ ఆభరణాల చరిత్రతో చాలా మంచి అనుబంధం ఉంది ఈ తరహా నగలు కేవలం మొగల్ కాలంలో మాత్రమే దొరికేవని తెలుస్తోంది.
ఇలా సమంత కోసం రాజ్ ప్రత్యేకంగా ఈ రింగ్ తయారు చేయించి ప్రొపోజ్ చేశారని తెలుస్తోంది. ఇక సమంత వివాహం డిసెంబర్ 1, 2025 సంవత్సరంలో ఈషా ఫౌండేషన్ లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇలా గత ఏడాది వివాహం చేసుకున్న సమంత అతి త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా త్వరలోనే బిడ్డ జన్మించబోతున్న నేపథ్యంలో సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన ప్రేగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.